AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. కొండచిలువను ఓ ఆటాడుకున్న యువతి

వామ్మో.. కొండచిలువను ఓ ఆటాడుకున్న యువతి

Phani CH
|

Updated on: Nov 10, 2025 | 2:38 PM

Share

సాధారణంగా భయపడే పాములను పట్టుకున్న ఓ మహిళ వీడియో వైరల్ అవుతోంది. పొలంలో కనిపించిన భారీ కొండచిలువను ఒంటరిగా పట్టుకునేందుకు ఆమె సాహసించింది. పాము దాడి చేసినా వెనకాడక, దానిని బుష్ నుండి బయటకు లాగింది. ఈ డేరింగ్ వీడియోను లక్షలాది మంది వీక్షించి, ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు.

సాధారణంగా పాములంటే అందరికీ భయమే. కొందరైతే పాము పేరు చెబితేనే భయంతో వణికిపోతారు. కొందరు మాత్రం పాములతో ఆటాడుకుంటారు. అలాంటి వీడియోలు తరచూ నెట్టింట వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ యువతి భారీ కొండచిలువను ఒంటిచేత్తో పట్టుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో, చీర కట్టుకున్న ఓ మహిళ పొలానికి వెళ్లింది. అక్కడ పొలం గట్టుపైన ఓ దిబ్బలాటి ప్రదేశంలో భారీ కొండచిలువను చూసింది. వెంటనే దాన్ని పట్టుకోడానికి ప్రయత్నించింది. కొండచిలువను బంధించేందుకు ఎంతో చాకచక్యంగా దాని తోకను పట్టుకుంది. అయితే కొండచిలువ ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. దెబ్బకు పామును వదిలి పక్కకు జరిగింది ఆ మహిళ. హమ్మయ్య..తప్పించుకున్నాను అన్నట్టుగా ఆ కొండచిలువ నెమ్మదిగా పొదల్లోకి జారుకోబోయింది. కానీ ఆ మహిళ పట్టు వదలలేదు. మళ్ళీ కొండచిలువ తోకను పట్టుకుని పొదల నుండి బయటకు లాగింది. అతి కష్టం మీద, ఆమె పొదల నుండి కొండచిలువను బయటకు లాగి రక్షించింది. ఇంత ప్రమాదకరమైన పామును మహిళలు పట్టుకోవడం చాలా అరుదు..!ఈ వీడియోను ఓ యూజర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 16 మిలియన్లమంది వీక్షించగా… 3 లక్షలమందికి పైగా లైక్‌ చేస్తూ..తమదైనశైలిలో కామెంట్లు చేశారు. ఈ మహిళ నిజమైన సింహం, అందరికీ అంత ధైర్యం ఉండదని కొందరు, ఆమెను చూడగానే నాకు భయమేసిందని మరొకరు కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pawan Kalyan: కాలినడకన అడవిలో పవన్ టూర్‌

40 వృద్ధ జంటలకు సొంత ఖర్చుతో రెండోసారి పెళ్లి చేసిన పూజారి

USA: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళి మృత్యువాత

ఓర్నాయనో.. ఇక నుంచి వర్షాలే కాదు.. గజగజ వణికించే చలి కూడా.. ఐఎండీ కీలక అప్డేట్‌

గంజాయి మత్తులో రచ్చ రచ్చ.. డ్రైవర్‌పై దాడి