AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: కాలినడకన అడవిలో పవన్ టూర్‌

Pawan Kalyan: కాలినడకన అడవిలో పవన్ టూర్‌

Phani CH
|

Updated on: Nov 10, 2025 | 2:32 PM

Share

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతి మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. అటవీ రక్షణ, ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు. పవన్ కల్యాణ్ స్వయంగా కాలినడకన అడవిలో పర్యటించి, చెట్లను పరిశీలించారు. ఎర్రచందనం గోడౌన్‌ను తనిఖీ చేసి, ప్రతి దుంగకు బార్‌కోడింగ్, లైవ్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ మంత్రి పవన్ కల్యాణ్ తిరుపతిలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. కాన్వాయ్‌ను వదలి, సాధారణంగా కాలినడకన.. అడవిలో కలదిరిగారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి అక్కడి వివరాలను తెలుసుకున్నారు. అటవీ రక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీసిన డిప్యూటీ సీఎం, సిబ్బందికి తగు సూచనలిచ్చారు. పర్యటనలో పవన్ కల్యాణ్ అటవీ మార్గంలో నాలుగు కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. వాహనం దిగి కాలినడకన దాదాపు రెండు కిలోమీటర్లు అడవి లోపలికి వెళ్లారు. దారి పొడవునా ప్రతి చెట్టును, మొక్కను ఆసక్తిగా గమనిస్తూ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు కేవలం శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే అరుదైన వృక్ష జాతుల గురించి ఆరా తీశారు. నేపియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్‌ ఎక్కి మొత్తం అటవీ ప్రాంతాన్ని వీక్షించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది ఉద్భవించే ప్రాంతం వంటి భౌగోళిక అంశాలపై అధికారులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పర్యటనలో భాగంగా గుంటి మడుగు వాగు వద్ద కాసేపు కూర్చుని, అక్కడి ప్రశాంత వాతావరణాన్ని, పరిసరాలను తిలకించారు. వాగుకు ఇరువైపులా ఉన్న చెట్ల రకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ సమస్య పై పవన్ దృష్టి సారించారు. స్మగ్లింగ్‌ను అరికట్టడానికి చేపడుతున్న చర్యలు, టాస్క్‌ఫోర్స్ పనితీరు, అటవీ సిబ్బంది నిర్వహిస్తున్న కూంబింగ్ ఆపరేషన్ల గురించి అధికారులతో సమీక్షించారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకుని, వారికి పలు సూచనలు చేశారు. మామండూరు అటవీ ప్రాంతంలో అటవీ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్ ను కూడా పరిశీలించారు. 8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ, బి. సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్ లో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడయ్యే వరకు ఒక్క దుంగ కూడా మిస్ కాకూడదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

40 వృద్ధ జంటలకు సొంత ఖర్చుతో రెండోసారి పెళ్లి చేసిన పూజారి

USA: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళి మృత్యువాత

ఓర్నాయనో.. ఇక నుంచి వర్షాలే కాదు.. గజగజ వణికించే చలి కూడా.. ఐఎండీ కీలక అప్డేట్‌

గంజాయి మత్తులో రచ్చ రచ్చ.. డ్రైవర్‌పై దాడి

ఉగ్ర దాడులకు ప్లాన్.. ముగ్గురు తీవ్రవాదులు అరెస్ట్