USA: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళి మృత్యువాత
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళిన బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన యార్లగడ్డ రాజ్యలక్ష్మి కలలు కల్లలయ్యాయి. చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం సంపాదించాలనుకున్న తరుణంలో, తీవ్రమైన దగ్గు, ఛాతినొప్పితో ఆకస్మికంగా మృతిచెందింది. టెక్సాస్ A&M యూనివర్సిటీలో పట్టా అందుకున్న కొద్దిరోజులకే ఈ విషాదం చోటుచేసుకుంది. కుమార్తె మరణవార్తతో కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఎన్నో కలలతో ఉన్నత విద్యనభ్యసించేందుకు అమెరికా వెళ్లింది. కష్టపడి చదువు పూర్తిచేసుకుంది. ఇక ఏదొక ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నలకు అండగా నిలవాలనుకుంది. ఇంతలోనే విధి వక్రించింది. అనారోగ్యం రూపంలో ఆ యువతిని కాటేసింది. తన కల నెరవేరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిర యార్లగడ్డ రాజ్యలక్ష్మి అమెరికాలోని టెక్సాస్ A&M యూనివర్సిటీ –కార్పస్ క్రిస్టీ లో చదువుతోంది. ఇటీవలే చదువు పూర్తికావడంతో పట్టాకూడా అందుకుంది. ఇక తన కల నెరవేరబోతుంది అనుకున్న క్షణంలో రాజికి అనారోగ్యం చేసింది. రెండుమూడు రోజులుగా తీవ్రమైన దగ్గు, ఛాతినొప్పితో బాధపడుతుంది. రోజూలాగే మందులు వేసుకొని నిద్రపోయింది. అయితే ఆరోజు అలారం మోగినా లేవలేదు. రోజూ టైముకి లేచి రెడీ అయ్యే రాజి ఇంకా లేవలేదేంటని అనుమానం వచ్చిన స్నేహితులు పరిశీలించి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్టు తెలిసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. కష్టపడి చదువు పూర్తిచేసుకొని జీవితంలో సెటిలవుదామనుకునే సమయంలో ఇలా ఆకస్మికంగా మృతిచెందడంతో రాజి స్వగ్రామంలో సైతం విషాదఛాయలు అలముకున్నాయి. రాజి మృతదేహాన్ని స్వగ్రామం కారంచేడుకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓర్నాయనో.. ఇక నుంచి వర్షాలే కాదు.. గజగజ వణికించే చలి కూడా.. ఐఎండీ కీలక అప్డేట్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

