బ్రో.. ఈ మేకను తీసుకొని.. ఆలుగడ్డలివ్వు..
పాత వస్తు మార్పిడి విధానం ఆధునిక ప్రపంచంలో అంతరించిపోయినా, ఈక్వెడార్‌లోని ఇన్కా తెగ ఇప్పటికీ దానిని కొనసాగిస్తోంది. ఆండీస్ పర్వతాల అడుగున జరిగే గురువారం సంతలో పశువులు, వ్యవసాయ ఉత్పత్తులను మార్పిడి చేసుకుంటూ జీవిస్తున్నారు. కరెన్సీకి దూరంగా, ప్రాచీన సంస్కృతిని కాపాడుకుంటూ, మోసం తెలియని నిజాయితీతో కూడిన వారి జీవన విధానం పర్యాటకులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ సంప్రదాయం ఆధునిక సమాజానికి ఎంతో నేర్పుతుంది.
పాత రోజుల్లో వస్తు మార్పిడి విధానం అమల్లో ఉండేది. ఒకరు తయారు చేసిన వస్తువులను మరొకరికి ఇచ్చి.. దానికి బదులుగా తమకు కావాల్సి వస్తువులను తీసుకునే ఆ విధానం.. కాలక్రమంలో మాయమైపోయింది. ఇప్పుడు నగదు, డిజిటల్ లావాదేవీలే ప్రపంచవ్యాప్తంగా రాజ్యమేలుతున్నాయి. అయితే.. నేటికీ వస్తుమార్పిడి విధానంతోనే తమ జీవితాలను కొనసాగిస్తున్న ఒక తెగ ఈక్వెడార్ దేశంలో మనుగడలో ఉంది. ప్రతి గురువారం అక్కడ జరిగే సంతలో ఇన్కా తెగ వాసులు.. కరెన్సీతో సంబంధం లేకుండా కేవలం పశువుల ఆధారంగా చేస్తున్న లావాదేవీలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ దేశంలోని ఆండీస్ పర్వతాల అడుగున ఉన్న గ్వామొటె మార్కెట్‌లో ప్రతి గురువారం జరిగే ప్రత్యేకమైన సంత కిటకిటలాడుతుంది. ఆధునిక ప్రపంచం అంటే ఏమిటో కూడా తెలియని ఇన్కా తెగ ప్రజలు వందల సంఖ్యలో సంత టైంకి చేరుకుంటారు. ఒకరు పందిని తెస్తే, మరొకరు ఆలుగడ్డల బస్తా తీసుకొస్తారు. ఇంకొకరు చేనేత వస్త్రాలు… ఇలా తమ ఉత్పత్తులను అక్కడ చక్కగా అమర్చుకుని అమ్మకాలు మొదలు పెడతారు.ఈ సంతలో కోళ్లు, పందులు, గొర్రెలు, మేకలు, వ్యవసాయ ఉత్పత్తుల, ఆలుగడ్డలు, క్యారెట్లు, ఆహార పదార్థాలను అక్కడి వారికి ఇచ్చి.. తమకు కావాల్సినవి కొనుక్కొని పోతుంటారు. ఇప్పుడిప్పుడే చిరుతిళ్లు అమ్మేవారు, ఇతర వ్యాపారులు కరెన్సీకు అలవాటుపడుతున్నారు. పనిలో పనిగా ఈ సంతలో తమ దూరపు బంధువులతో మాట్లాడుతూ.. వారి మంచీ చెడూ కనుక్కొంటారు. ఇన్కా నాగరికతకు చెందిన వీరు ఆధునిక సమాజానికి దూరంగా ఉంటారు.ఈక్వెడార్ లో పెద్దగా ఆర్థికప్రగతి లేకపోవడం, నిరక్షరాస్యత, సాయుధ సంఘర్షణలు దేశాభివృద్ధికి శాపంగా మారాయి. ఇక్కడి ప్రజలు ఎక్కువగా చేనేత దుస్తులను ధరిస్తారు. ఇవి రంగు రంగుల్లో నేయడంతో సంతల్లో రంగుల లోకం కనిపిస్తుంది. వేల సంవత్సరాల నుంచి ఇదే జీవన విధానం కొనసాగుతోంది. ఇక్కడికి ఏటా వేలాది మంది విదేశీ పర్యాటకులు వస్తుంటారు. మోసం అనేది తెలియని, ఈ మంచి మనుషల నిజాయితీని, వారి సాధారణ జీవన శైలిని చూసి పర్యాటకులు ఆశ్యర్యపోతుంటారు.బోలెడన్ని జ్ఞాపకాలు అక్కడి సంతలో మూటగట్టుకుని స్వదేశానికి చేరుకుంటారు. అభివృద్ధి పేరుతో అసమానతల గోడలు నిర్మించుకుంటున్న ఆధునిక సమాజం ఈ అమాయకులైన ఆటవికుల నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది ఉందని ఆ పర్యాటకులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నానబెట్టిన బాదంను నెలపాటు తినండి.. అదిరిపోయే మార్పులు చూస్తారు
ఇంటి ముందు డ్రైన్‌లో వింత శబ్ధాలు.. తొంగి చూస్తే షాకింగ్ సీన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

