AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నానబెట్టిన బాదంను నెలపాటు తినండి.. అదిరిపోయే మార్పులు చూస్తారు

నానబెట్టిన బాదంను నెలపాటు తినండి.. అదిరిపోయే మార్పులు చూస్తారు

Phani CH
|

Updated on: Nov 09, 2025 | 2:37 PM

Share

ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పులు తింటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఈ చిన్న అలవాటులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి బాదం తినడం కన్నా, రాత్రంతా నానబెట్టి పొట్టు తీసి తినడమే ఉత్తమమని స్పష్టం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పోషకాలు శరీరానికి సులభంగా అందడమే కాకుండా, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందట.

రోజూ నానబెట్టిన బాదం పప్పులను నెల రోజుల పాటు తింటే మన శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో ఇప్పుడు చూద్దాం. నిపుణులు ప్రకారం.. ప్రతిరోజూ 5 నుంచి 8 బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం వాటిపై ఉండే పొట్టును తీసేసి తినాలి. ఈ పొట్టులో ఉండే ‘టానిన్లు’ పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఈ బాదం పప్పులను పరగడుపున లేదా ఉదయం అల్పాహారంతో పాటు తీసుకోవడం మంచిది. ఇలా నానబెట్టిన బాదం పప్పులు తినడం మొదలు పెట్టిన తొలి వారంలోనే కొన్ని సానుకూల మార్పులు కనిపిస్తాయి. బాదంలో ఫైబర్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయదు. దీంతో అనవసరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. రెండోవారం పూర్తయ్యే సరికి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆకలిని నియంత్రించడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. క్రమం తప్పకుండా బాదం తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం. నెల రోజుల తర్వాత మీలో శక్తి స్థాయిలు స్థిరంగా ఉండటాన్ని గమనించవచ్చు. బాదంలో ఉండే విటమిన్-ఇ, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి కొత్త మెరుపును అందించి, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉదయాన్నే ఒక మంచి అలవాటును పాటిస్తున్నామనే భావన మానసికంగా కూడా ఉత్తేజాన్నిస్తుంది. నానబెట్టిన బాదం మంచిదే అయినా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. బాదంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, రోజుకు 5 నుంచి 10 పప్పులకు మించి తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం మంచి ఆహారం, వ్యాయామం కూడా అవసరం. అలర్జీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వైద్యులను సంప్రదించిన తర్వాతే దీనిని మీ ఆహారంలో భాగం చేసుకోవడం శ్రేయస్కరం. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటి ముందు డ్రైన్‌లో వింత శబ్ధాలు.. తొంగి చూస్తే షాకింగ్‌ సీన్‌

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. కాటు వేస్తే

ఆ ఆలయంలో ఎలుకలే దేవుళ్లు..!

ఆఫ్రికన్‌ నత్తల దండయాత్ర.. మొక్కలు, తోటల విధ్వంసం

పెరట్లో కలుపు మొక్కలున్నాయా ?? జాగ్రత్త !!