40 వృద్ధ జంటలకు సొంత ఖర్చుతో రెండోసారి పెళ్లి చేసిన పూజారి
ఖమ్మం జిల్లా తల్లంపాడులో పూజారి పురుషోత్తం శాస్త్రి చొరవతో 40 వృద్ధ జంటలకు సామూహిక షష్టిపూర్తి మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కార్తీక పౌర్ణమి నాడు, తన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, దంపతులకు నూతన వస్త్రాలు అందించి, సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారు. గ్రామస్తుల ప్రశంసలు అందుకున్న ఈ పూజారి ఆదర్శప్రాయమైన సేవకు నిదర్శనం.
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 40 వృద్ద జంటలు ఒకేసారి రెండోసారి పెళ్లి చేసుకున్నారు. గ్రామంలోని పూజారికి వచ్చిన ఆలోచన ఇలా సామూహిక షష్టిపూర్తి కార్యక్రమానికి నాంది పలికింది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం తల్లంపాడులో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో కాశవజ్జల పురుషోత్తం శాస్త్రి 45 ఏళ్లుగా రామాలయంలో పూజారిగా సేవలందిస్తున్నారు. అందరూ బాగుండాలి, పాడిపంటలతో గ్రామం కళకళలాడాలని కోరుకునే వ్యక్తి ఆ పూజారి. అందుకే గ్రామం కోసం తన వంతుగా ఏదో ఒకటి చేయాలనుకున్నారు. ఆ ఆలోచనతో కార్తీకమాసం సందర్భంగా గ్రామంలో 40 మంది వృద్ధ జంటలకు షష్టిపూర్తి మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలచారు. పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున గ్రామంలో 65 ఏళ్లు నిండిన 40 జంటలకు.. తాను నిత్యం పూజించే రామాలయంలో తన సొంత ఖర్చులతో ఆ పూజారి షష్టిపూర్తి కార్యక్రమం మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ జంటలకు నూతన వస్త్రాలు, శాలువాలు, పూలదండలు తీసుకువచ్చి షష్టిపూర్తి చేయించారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేపట్టి ఆదర్శంగా నిలిచారు. వృద్ధ దంపతులతో ఒకరికొకరు దండలు మార్పించడంతో పాటు అనంతరం వారితో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం చేయించారు. పూజానంతరం 40 జంటలను పూజారి ఆశీర్వదించారు. ఆయనను గ్రామస్తులు అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
USA: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళి మృత్యువాత
ఓర్నాయనో.. ఇక నుంచి వర్షాలే కాదు.. గజగజ వణికించే చలి కూడా.. ఐఎండీ కీలక అప్డేట్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

