నడిరోడ్డుపై వ్యక్తి పరుగులు.. ప్లాన్డ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పౌర సరఫరాల శాఖ డిప్యూటీ మేనేజర్ రూ.75 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రైస్ మిల్ యజమాని నుండి CMR బియ్యం ధ్రువీకరణకు లంచం డిమాండ్ చేశారు. బాధితుడికి గతంలో వేధింపులు, తప్పుడు కేసులు ఎదురయ్యాయి. హైకోర్టు ఆదేశాలు ఉన్నా బియ్యం విడుదల చేయకపోవడంతో ఏసీబీని ఆశ్రయించారు. పౌర సరఫరాల శాఖలో అవినీతిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఓ రైస్ మిల్ యజమాని వద్ద, జిల్లా పౌర సరఫరాల శాఖ డిఎం 75 వేల రూపాయలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. నడి రోడ్డు పై లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రావడం చూసి పరుగులు తీశాడు ఆ అధికారి. ఈ సంఘటన కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఏసిబి డిఎస్పి మధు తెలిపిన వివరాల ప్రకారం.. దహేగాంకు చెందిన వాసవి మోడ్రన్ రైస్ మిల్ నుండి సిఎంఆర్ బియ్యం ను నాణ్యత ప్రమాణాలను పరిశీలించి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు ఒక్కో లారీకి 25 వేల రూపాయలు డిఎం నర్సింగరావు డిమాండ్ చేశాడు. సదరు అధికారికి గురువారం సాయంత్రం రెబ్బెన మండలంలోని కైరుగాం వద్ద బాధితుడు మూడు లారీలకు సంబంధించిన 75 వేల రూపాయలు ఇస్తుండగా ఏసిబి అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నర్సింగరావు తో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగి మణికంఠ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.బాధితుడు నుండి ఇప్పటికే 16 లారీలకు సంబంధించిన డబ్బులు పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకున్నట్లు డి.ఎస్.పి వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడడంతో పాటు లంచం కోసం సామాన్య జనాన్ని వేధింపులకు గురిచేస్తే 1064, 9154388963 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. పౌరసరఫరాల శాఖ అధికారుల వేధింపులు తట్టుకోలేకనే ఏసీబీని ఆశ్రయించినట్లు బాధితుడు సందీప్ తెలిపారు. వాసవి మాడ్రన్ రైస్ మిల్ నునడుపుతున్న సందీప్, రబీ సీజన్ లో వడ్లు పట్టకుండా ట్రక్ షీట్ ఇవ్వాలని అధికారులు కోరడంతో తాను నిరాకరించాడు. దీంతో తనపై అధికారులు సెప్టెంబర్ 9 న కేసు నమోదు చేశారు. దీంతో అవి రేషన్ బియ్యం కాదని కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించానని సందీప్ తెలిపాడు. హైకోర్టు ఆదేశాల మేరకు సీజ్ చేసిన బియ్యాన్ని పరిశీలించి అవి రేషన్ బియ్యం కాదని తేలడంతో సీజ్ చేసిన బియ్యం రిలీజ్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, అధికారులు బియ్యం రిలీజ్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.దీంతో వారి వేధింపులు తట్టుకోలేకనే ఏసీబీ ని ఆశ్రయించినట్టు చెప్పాడు. పౌర సరఫరాల శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఇందులో ఉన్నతాధికారులు సైతం ఉన్నారని బాధితుడు ఆరోపించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మన అనకాపల్లి అమ్మాయే.. వరల్డ్ కప్ క్రికెట్ కామెంటేటర్
కాలు నొప్పిగా ఉంది.. వైద్యం చేయమని అడిగిన వీధి కుక్క.. వీడియో వైరల్
ఆటోలో నగల బ్యాగ్.. డ్రైవర్ ఏం చేశాడంటే
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

