మన అనకాపల్లి అమ్మాయే.. వరల్డ్ కప్ క్రికెట్ కామెంటేటర్
ఇటీవల జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్‌లో కామెంటేటర్‌గా రాణించిన కస్తూరి నాయుడు ప్రయాణం స్ఫూర్తిదాయకం. అనకాపల్లి, విశాఖపట్నం మూలాలున్న ఈ సౌతాఫ్రికా కామెంటేటర్, పురుషాధిక్య క్రికెట్ ప్రపంచంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. క్రికెట్ నేపథ్యం లేకున్నా, ఆమె తన కలను సాకారం చేసుకున్నారు. తన భారతీయ మూలాలు, కెరీర్ విశేషాలను పంచుకున్నారు.
ఇటీవల భారత్ వేదికగా జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్‌లో కామెంటేటర్‌గా కస్తూరి నాయుడు చేసారు. ఆమె కుటుంబానికి అనకాపల్లితో వందేళ్లకుపైగా అనుబంధం ఉంది. క్రికెట్ నేపథ్యం లేకపోయినా.. పురుషాధిక్య క్రికెట్ ప్రపంచంలో ఆమె రాణిస్తుండటం గొప్ప విషయం. సౌతాఫ్రికాకు చెందిన క్రికెట్ కామెంటేటర్ కస్తూరి నాయుడూ.. భారత్‌లో తాను కామెంటరీ చేయాలన్న కలను నెరవేర్చుకున్నారు. ఆమె భారతదేశ మూలాలు, తన ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను షేర్ చేసుకున్నారు. కస్ నాయుడూ.. ఆంధ్రప్రదేశ్‌తో అనుబంధం గురించి స్వయంగా చెప్పారు. ‘మా అమ్మ వాళ్ల నాన్న.. అనకాపల్లికి చెందిన వెంకోజిపాలెంలో జన్మించారు. 1910లో తనకు ఐదేళ్ల వయసులో ఓడలో ప్రయాణించి దక్షిణాఫ్రికాకు చేరుకున్నారు. ఇందుకు 45 రోజులు పట్టింది.’ అని వివరించారు. ఇంకా తన నానమ్మ కూడా విశాఖపట్నంలోని ఎలమంచిలికి చెందినవారేనని అన్నారు కస్. తన తల్లి భగవతి.. 1968లో ఓడలో 6 నెలల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసి.. భారతదేశాన్ని సందర్శించారని.. 1993, 2007లో కూడా తీర్థయాత్రల కోసం భారతదేశానికి వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. అదే సమయంలో ఆమె తన క్రికెట్ కెరీర్ గురించి విశేషాలు పంచుకున్నారు. క్రికెట్ ఆడిన అనుభవం లేకున్నా.. ఈ రంగంలోకి ప్రవేశించడం తనకు చాలా కష్టమైందని చెప్పారు. క్రికెట్లో చాలా కాలంగా పురుషులదే ఆధిపత్యమనీ ఇది మరింత సవాల్ విసిరిందని ఆమె చెప్పారు. తాను తన పాత్రను అర్థం చేసుకున్నానని.. స్పోర్ట్స్ ప్రజెంటర్ లేదా కామెంటేటర్ అయినప్పటికీ.. తాను క్రీడా పండితుల నుంచి సమాచారాన్ని ప్రేక్షకులకు చేరవేసే ఫెసిలిటేటర్ మాత్రమేనని చెప్పారు. ఇదే సమయంలో గొప్ప క్రీడా నిపుణులతో పనిచేయడం.. వారి నుంచి ఎన్నో విషయాల్ని నేర్చుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాలు నొప్పిగా ఉంది.. వైద్యం చేయమని అడిగిన వీధి కుక్క.. వీడియో వైరల్
ఆటోలో నగల బ్యాగ్.. డ్రైవర్ ఏం చేశాడంటే
వామ్మో.. కొండచిలువను ఓ ఆటాడుకున్న యువతి
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

