AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబరులో నింగిలో అన్నీ అద్భుతాలే

నవంబరులో నింగిలో అన్నీ అద్భుతాలే

Phani CH
|

Updated on: Nov 09, 2025 | 3:50 PM

Share

నవంబర్‌లో ఆకాశం అనేక ఖగోళ అద్భుతాలకు వేదికైంది. ఇప్పటికే కనిపించిన బీవర్ సూపర్‌మూన్‌తో పాటు, లియోనిడ్స్, టారిడ్స్ వంటి ఐదు ఉల్కాపాతాలు కనువిందు చేయనున్నాయి. యురేనస్ భూమికి చేరువగా రావడం, శుక్రుడు-బుధుల సంగమం, శని వలయాలు అదృశ్యమవడం వంటి గ్రహ కదలికలు ఈ నెల ప్రత్యేకతలు. ఔత్సాహికులు ఈ అద్భుతాలను ఆస్వాదించవచ్చు.

నవంబరు నెలలో ఆకాశంలో పలు అద్భుతాలు జరగనున్నాయి. ఈ నెలలో దాదాపు ప్రతి వారం నింగిలో ఒక కొత్త అద్భుతం కనువిందు చేయనుంది. ఉల్కాపాతాల వర్షం, గ్రహాల కదలికలు, అతిపెద్ద సూపర్ మూన్ వంటివి చోటుచేసుకోనున్నాయి. ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ దృశ్యాలను ఆస్వాదించవచ్చు. నవంబర్ 5వ తేదీన అత్యంత పెద్దదిగా, ప్రకాశవంతంగా ‘బీవర్ సూపర్‌మూన్’ ఆవిష్కృతమైంది. సాధారణ పౌర్ణమి చంద్రుడి కంటే ఇది దాదాపు 8% పెద్దదిగా, 16% ఎక్కువ ప్రకాశవంతంగా కనిపించింది. నవంబర్ ఆరంభంలోనే ఈ అద్భుత దృశ్యం ఆకాశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నెలలో ఏకంగా ఐదు ఉల్కాపాతాలు అలరించనున్నాయి. నవంబర్ 4-5 తేదీల్లో సదరన్ టారిడ్స్, 11, 12 తేదీల్లో నార్తర్న్ టారిడ్స్ ఉల్కాపాతాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఇవి నెమ్మదిగా కదులుతూ, ప్రకాశవంతమైన అగ్నిగోళాలను సృష్టిస్తాయి. వీటన్నింటిలో ముఖ్యమైనది లియోనిడ్స్ ఉల్కాపాతం. నవంబర్ 17,18 తేదీల్లో ఇది గరిష్ట స్థాయికి చేరనుంది. ఆ సమయంలో చంద్రుడి కాంతి తక్కువగా ఉండటంతో, గంటకు 15 వరకు వేగవంతమైన, ప్రకాశవంతమైన ఉల్కలను స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది. నవంబర్ 21న ఆల్ఫా మోనోసెరోటిడ్స్, 28న ఓరియోనిడ్స్ కూడా కనిపించనున్నాయి. అరుదైన సందర్భాల్లో ఆల్ఫా మోనోసెరోటిడ్స్ గంటకు వెయ్యికి పైగా ఉల్కలతో అద్భుతం సృష్టిస్తాయి. ఈ నెలలో ఉల్కలే కాకుండా గ్రహాల కదలికలు కూడా ఆకట్టుకోనున్నాయి. నవంబర్ 21న యురేనస్ గ్రహం భూమికి అత్యంత దగ్గరగా, ప్రకాశవంతంగా కనిపించనుంది. టెలిస్కోప్ సహాయంతో దీనిని స్పష్టంగా చూడవచ్చు. నవంబర్ 25న ఆకాశంలో శుక్రుడు, బుధ గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి కనువిందు చేయనున్నాయి. నవంబర్ 23న భూమికి, శనిగ్రహ వలయాలకు మధ్య ఉండే కోణం కారణంగా ఆ వలయాలు దాదాపు అదృశ్యమైనట్టు కనిపిస్తాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సుడిగాడు.. కొంచెం ఉంటే బస్సు చక్రాల కిందే

ఈజిప్టు మమ్మీల శాపం నిజమైందా

చీమల భయంతో ప్రాణాలు తీసుకున్న మహిళ

అదృష్టం అంటే ఇదే.. లక్కీ డ్రాలో పావుకేజీ బంగారం

దమ్ముంటే రా పట్టుకో.. కుక్కకు పక్షి సవాల్‌