చీమల భయంతో ప్రాణాలు తీసుకున్న మహిళ
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో చీమల ఫోబియాతో మనీషా ఆత్మహత్య విషాదం చోటుచేసుకుంది. మైర్మెకోఫోబియా బాధను తట్టుకోలేక ఆమె తన ప్రాణాలను తీసుకుంది. ఈ ఘటన ఫోబియాల తీవ్రతను, మానసిక ఆరోగ్యానికి సరైన చికిత్స ఎంత అవసరమో గుర్తుచేస్తుంది. దీర్ఘకాలిక భయాలు డిప్రెషన్‌కు దారితీసి, ఆత్మహత్యకు ప్రేరేపించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ లోని మనీషా కొంతకాలంగా చీమల ఫోబియాతో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చూపించినా ఫలితం లేకపోయింది. భర్త శ్రీకాంత్ ఆఫీసుకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి.. బెడ్‌రూమ్ తలుపు లోపల గడియ పెట్టి ఉంది. స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా.. మనీషా చీరతో ఉరి వేసుకుని కనిపించింది. కొందరికి ఎత్తైన భవనాలు చూస్తే భయం.. ఇంకొందరికి లోతైన బావులను చూస్తే భయం.. మరికొందరికి చీకటి చూస్తే భయం.. ఇలా చాలా మంది కొన్ని కొన్ని వస్తువులను, ప్రాంతాలను, జంతువులను చూస్తే భయంతో వణికిపోతుంటారు. ఆ క్షణంలో వారు ఏం చేస్తారో కూడా అర్థం కాదు. స్పృహతప్పి పడిపోవటం, కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవటం కూడా జరుగుతుంది. పోలీసులు గదిని పరిశీలించగా.. అక్కడ ఒక నోట్‌బుక్‌లో సూసైడ్ నోట్ దొరికింది. అందులో, ‘శ్రీ.. ఐయాం సారీ.. ఈ చీమలతో బ్రతకడం నావల్ల కావట్లేదు… కూతురు అన్వి జాగ్రత్త.. అన్నవరం, తిరుపతి, ఎల్లమ్మ మెుక్కులు తీర్చండి’ అని రాసి ఉంది. ఈ సూసైడ్ నోట్ ఆమె ఫోబియా తీవ్రతను, మానసిక క్షోభను తెలియచేసింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చీమల ఫోబియా అనేది మానసిక ఆందోళన మాత్రమే కాదు, అదొక క్లినికల్ ఫోబియా. చీమల ఫోబియాను శాస్త్రీయ భాషలో మైర్మెకోఫోబియా అంటారు. చీమల పట్ల లేదా చీమలు కుట్టడం పట్ల విపరీతమైన భయం ఉండటం. ఈ భయం చీమలను చూసినప్పుడు మాత్రమే కాకుండా.. వాటి గురించి ఆలోచించినప్పుడు లేదా వాటి గురించి మాట్లాడినప్పుడు కూడా రావచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. మైర్మెకోఫోబియాతో బాధపడేవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. గుండె వేగంగా కొట్టుకోవడం, చెమట పట్టడం, వణుకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పానిక్ ఎటాక్ రావడం జరుగుతుంది. ఒక వ్యక్తికి రోజూ ఎదురయ్యే వస్తువు పట్ల విపరీతమైన భయం ఉంటే అది తీవ్ర డిప్రెషన్‌కు దారి తీస్తుంది. నిరంతర భయం నుంచి బయటపడటానికి ఆత్మహత్యే ఏకైక మార్గమని ఆ వ్యక్తి భావించే ప్రమాదం ఉంది. మనీషా విషయంలో కూడా.. తన భయం ఆమెను జీవించడానికి వీలు లేని విధంగా బాధించింది. మానసిక ఆరోగ్యం, ఫోబియాలకు చికిత్స ఎంత అవసరమో ఈ విషాదకర ఘటన గుర్తు చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదృష్టం అంటే ఇదే.. లక్కీ డ్రాలో పావుకేజీ బంగారం
దమ్ముంటే రా పట్టుకో.. కుక్కకు పక్షి సవాల్
ఒక్క నెలలోనే ఏకంగా 39,000 కేజీల బంగారం కొనుగోలు
ఢిల్లీకి సాయం చేస్తామన్న చైనా.. మన రిప్లయ్ పై ఉత్కంఠ
ఒకప్పుడు ఆటో డ్రైవర్.. ఇప్పుడు నెంబర్ ప్లేట్ కోసం 32 లక్షలు ఖర్చు..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

