AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీకి సాయం చేస్తామన్న చైనా.. మన రిప్లయ్ పై ఉత్కంఠ

ఢిల్లీకి సాయం చేస్తామన్న చైనా.. మన రిప్లయ్ పై ఉత్కంఠ

Phani CH
|

Updated on: Nov 09, 2025 | 3:13 PM

Share

ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి చైనా సహాయం అందించింది. గతంలో బీజింగ్ వంటి నగరాలు తీవ్ర కాలుష్యంతో బాధపడి, విజయవంతంగా నియంత్రించాయి. పరిశ్రమల మార్పిడి, వాహన ఉద్గార నియంత్రణ, స్వచ్ఛ ఇంధన వినియోగం వంటి తమ అనుభవాలను భారత్‌తో పంచుకునేందుకు చైనా సిద్ధంగా ఉంది. ఈ సహకారం ఢిల్లీ వాయు నాణ్యత మెరుగుపరచడానికి, ఇరు దేశాల దౌత్య సంబంధాలకు ప్రయోజనకరమని నిపుణులు భావిస్తున్నారు.

కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతున్న దేశ రాజధాని ఢిల్లీకి సాయం చేసేందుకు చైనా ముందుకొచ్చింది. వాయు నాణ్యత మెరుగుపరిచేందుకు తమవంతు సాయం అందిస్తామని బీజింగ్‌ వర్తమానం పంపింది. భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యుజింగ్ ఎక్స్ వేదికగా దీనిని ప్రకటించారు. చైనా కూడా ఒకప్పుడు తీవ్రమైన కాలుష్యంతో ఇబ్బంది పడింది. కానీ ప్రస్తుతం కాలుష్యం నుంచి బయటపడింది. ఆ అనుభవాలను భారత్‌తో పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. గతంలో చైనాలో కాలుష్యం ఏవిధంగా ఉండేది.. ప్రస్తుతం వాతావరణం ఎలా ఉందనే ఫోటోలను, కాలుష్య నియంత్రణకు చైనా తీసుకుంటున్న చర్యలను పోస్ట్ చేశారు. చైనా ప్రతిపాదనకు ఓకే చెబితే.. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో బీజింగ్ అనుభవాలను భారత్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. గత దశాబ్దంలో చైనా తన పరిశ్రమలను ఉన్న చోటు నుంచి మార్చడం, వాహన ఉద్గారాలను నియంత్రించడం, స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని పెంచడం, ఇలాంటి చర్యలను వేగంగా అమలు చేసింది. దీంతో బీజింగ్, షాంఘై వంటి నగరాల్లో కాలుష్యం గణనీయంగా తగ్గింది. భారత్, చైనా ఒకే విధమైన కాలుష్య సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.. టెక్నాలజీ, డేటా మార్పిడి, కర్బన ఉద్గార నియంత్రణ వ్యూహాలపై రెండు దేశాల మధ్యా సహకారం ఇరుపక్షాలకూ ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఈ ప్రకటనను ఒక దౌత్యపరమైన సంజ్ఞగా చూస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో చైనా నుంచి సహకార సందేశం దౌత్య సంబంధాల బలోపేతం, పర్యావరణ విషయంలో కలిసి పనిచేయడాన్ని సూచిస్తుందని అంటున్నారు. చైనా ఇచ్చిన ఆఫర్‌పై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న చర్చ జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకప్పుడు ఆటో డ్రైవర్.. ఇప్పుడు నెంబర్ ప్లేట్ కోసం 32 లక్షలు ఖర్చు..

Safety Pin: పిన్నీసు ధర రూ. 69 వేలు ??

బ్రో.. ఈ మేకను తీసుకొని.. ఆలుగ‌డ్డలివ్వు..

నానబెట్టిన బాదంను నెలపాటు తినండి.. అదిరిపోయే మార్పులు చూస్తారు

ఇంటి ముందు డ్రైన్‌లో వింత శబ్ధాలు.. తొంగి చూస్తే షాకింగ్‌ సీన్‌