దమ్ముంటే రా పట్టుకో.. కుక్కకు పక్షి సవాల్
రోడ్ రన్నర్ పక్షికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంటకు 42 కి.మీ వేగంతో పరుగెత్తగల ఈ పక్షి, అడవి కుక్కను కూడా సునాయాసంగా తప్పించుకుని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా పక్షులు ఎగిరిపోగా, ఇది నేలపైనే అత్యంత వేగంగా పరుగెత్తుతుంది. ఈ వైరల్ వీడియో లక్షలాది మందిని ఆకట్టుకుంటూ ప్రకృతిలోని అద్భుత శక్తులను చాటిచెబుతోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తుంటాయి. రోడ్ రన్నర్ పక్షి వీడియో కూడా వైరల్ అవుతోంది. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ రోడ్ రన్నర్ పక్షి కనబడుతోంది. సాధారణంగా గాల్లో ఎగిరే పక్షులు నేల మంది అంత వేగంగా పరుగులు పెట్టలేవు. ఏదైనా ఆపద వస్తే వెంటనే గాల్లోకి ఎగిరిపోతాయి. రోడ్ రన్నర్ పక్షి మాత్రం అందుకు భిన్నం. అది నేల మీద కూడా చాలా వేగంగా పరుగులు పెట్టగలదు. తాజగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ రోడ్ రన్నర్ పక్షిని అడవి కుక్క పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆ కుక్కకు దొరక్కుండా ఆ పక్షి అత్యంత వేగంగా పరిగెట్టింది. సాధారణంగా అడవి కుక్కలు చాలా వేగంగా పరిగెడతాయి. అలాంటి కుక్కకు కూడా అందకుండా ఆ పక్షి మరింత వేగంగా పరిగెట్టడం ఆశ్చర్యకరంగా మారింది. రోడ్ రన్నర్ అనే ఈ పక్షి ఈములా కనిపిస్తుంది. కానీ పరిమాణంలో చిన్నది. ఈ పక్షి గంటకు 42 కి.మీ వేగంతో పరిగెత్తుతుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 70 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ ప్రకృతి ఒక్కో జంతువుకు ఒక్కో సామర్థ్యం ఇచ్చిందని చాలా మంది కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క నెలలోనే ఏకంగా 39,000 కేజీల బంగారం కొనుగోలు
ఢిల్లీకి సాయం చేస్తామన్న చైనా.. మన రిప్లయ్ పై ఉత్కంఠ
ఒకప్పుడు ఆటో డ్రైవర్.. ఇప్పుడు నెంబర్ ప్లేట్ కోసం 32 లక్షలు ఖర్చు..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

