ఇకపై షుగర్ టెస్ట్ మరింత ఈజీ.. ఎలా అంటే ??
షుగర్ వ్యాధిగ్రస్తులకు ఒక గుడ్ న్యూస్. శరీరంలో చక్కెర స్థాయులను తెలుసుకోడానికి ఇకపై ప్రతిసారీ సూదితో గుచ్చి రక్తం తీసుకోవాల్సిన పనిలేదు. సంప్రదాయ పద్ధతులతో పనిలేకుండా సరికొత్త విధానం దాదాపు అందుబాటులోకి వచ్చింది. శ్వాస ద్వారా తెలుసుకొనే బెలూన్‌లాంటి సరికొత్త పరికరాన్ని హిమాచల్ ప్రదేశ్ ఐఐటీ మండీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరికరంలో రోగులు శ్వాసను ఊదితే అది ఆక్సిజన్, బీపీ వివరాలు చెబుతుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులకు ఒక గుడ్ న్యూస్. శరీరంలో చక్కెర స్థాయులను తెలుసుకోడానికి ఇకపై ప్రతిసారీ సూదితో గుచ్చి రక్తం తీసుకోవాల్సిన పనిలేదు. సంప్రదాయ పద్ధతులతో పనిలేకుండా సరికొత్త విధానం దాదాపు అందుబాటులోకి వచ్చింది. శ్వాస ద్వారా తెలుసుకొనే బెలూన్‌లాంటి సరికొత్త పరికరాన్ని హిమాచల్ ప్రదేశ్ ఐఐటీ మండీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరికరంలో రోగులు శ్వాసను ఊదితే అది ఆక్సిజన్, బీపీ వివరాలు చెబుతుంది. ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌లో ఆ రెండు వివరాలతోపాటు అది అడిగే మరికొన్ని వివరాలు నమోదు చేస్తే అన్నింటినీ క్రోఢీకరించి శరీరంలో మధుమేహ స్థాయులను వెల్లడిస్తుంది. ఈ పరికరానికి శాస్త్రవేత్తలు నాన్ ఇన్వాజివ్ గ్లూకోమీటర్ అని నామకరణం చేశారు. ఈ పరికరంతో ఇప్పటి వరకు పలు పరీక్షలు నిర్వహించగా మెరుగైన ఫలితాలు వచ్చినట్టు సీనియర్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ రీతు తెలిపారు. ఈ నాన్ ఇన్వాజివ్ గ్లూకోమీటర్‌లో 10 మల్టీ సెన్సార్లను అమర్చినట్టు పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. ఇకపై ఆఫీసుకు వెళ్తేనే..
కానిపాకం వినాయకుడితో పోటీపడి పెరుగుతున్న శివుడు !! ఎక్కడంటే ??
8 నెలలు మాయమై.. శివరాత్రికి కనిపించే ఆలయం
కేరళ పాఠశాలలో తొలిసారి ఏఐ పంతులమ్మ పాఠాలు..
మొబైల్ గేమ్ ఆడుతున్న బాలుడు.. గదిలోకి ప్రవేశించిన చిరుత.. ఏం జరిగిందంటే ??