Know Your Candidate: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను తెలిపే యాప్!
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమయం మొదలు కానుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందు కోసం బరిలో నిలిపేందుకు అభ్యర్థులను ప్రకటిస్తు్న్నాయి రాజకీయ పార్టీలు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పేర్లను ప్రకటించాయి. మీ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల విద్యార్హత, ఆస్తి, ఇతర వివరాలను ఈజీగా తెలుసుకోవచ్చు..
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమయం మొదలు కానుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందు కోసం బరిలో నిలిపేందుకు అభ్యర్థులను ప్రకటిస్తు్న్నాయి రాజకీయ పార్టీలు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పేర్లను ప్రకటించాయి. మీ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల విద్యార్హత, ఆస్తి, ఇతర వివరాలను ఈజీగా తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజుల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా క్షణాల్లో మనకు తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థి గురించి తెలుసుకోవాలని ఉంటుంది. వారి విద్యార్హత, ఆస్తి వివరాలు, వారికి నేర చరిత్ర ఉందా లేదా కూడా అనే విషయాలు చాలా మందికి తెలియదు. అయితే ఇలాంటి సమాచారాన్నంతా ఒకే క్లిక్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి జాతీయ ఎన్నికల సంఘం కొత్త యాప్‌ను విడుదల చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.