త్వరలో ఢిల్లీకి ఎయిర్‌ట్యాక్సీ.. 30 కి.మీ దూరానికి ఏడే నిమిషాలు

త్వరలో ఢిల్లీకి ఎయిర్‌ట్యాక్సీ.. 30 కి.మీ దూరానికి ఏడే నిమిషాలు

Phani CH

|

Updated on: Apr 20, 2024 | 9:09 PM

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీ సేవలు ప్రారంభించనున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, అమెరికాకు చెందిన ఆర్చర్‌ ఏవియేషన్‌ సంయుక్తంగా వీటిని రూపొందించనున్నట్లు చెప్పింది. 2026 నాటికి ఈ ఎయిర్‌ట్యాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయని అంచనా వేసింది. ఎయిర్‌ట్యాక్సీతో ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ నుంచి 30 కి.మీ దూరంలోని గురుగ్రామ్‌కు కేవలం 7 నిమిషాల్లోనే చేరుకోవచ్చని ఇండిగో పేర్కొంది.

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీ సేవలు ప్రారంభించనున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, అమెరికాకు చెందిన ఆర్చర్‌ ఏవియేషన్‌ సంయుక్తంగా వీటిని రూపొందించనున్నట్లు చెప్పింది. 2026 నాటికి ఈ ఎయిర్‌ట్యాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయని అంచనా వేసింది. ఎయిర్‌ట్యాక్సీతో ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ నుంచి 30 కి.మీ దూరంలోని గురుగ్రామ్‌కు కేవలం 7 నిమిషాల్లోనే చేరుకోవచ్చని ఇండిగో పేర్కొంది. ఈ ప్రయాణానికి 2 నుంచి 3 వేల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. అయితే అదే దూరం కారులో వెళ్లడానికి 90 నిమిషాలు సమయం పడుతుంది. ఎయిర్ టాక్సీలో ఆరు బ్యాటరీలు ఉంటాయని, 30 నుంచి 40 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జ్‌ అవుతాయని అన్నారు. ఢిల్లీతో పాటు ముంబయి, బెంగళూరుల్లో కూడా ఎయిర్‌ట్యాక్సీ సేవలను ప్రారంభించడానికి ఇంటర్‌గ్లోబ్‌ ఇంకా ఆర్చర్‌ ఏవియేషన్‌ ప్లాన్ చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణలో వర్షాలు..

ధోని ఎంట్రీతో దద్దరిల్లిన స్టేడియం.. యాపిల్‌ వాచ్‌ వార్నింగ్ అలర్ట్

భారత్-పాక్ సరిహద్దులో చైనా డ్రోన్ కలకలం

మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా ?? నోస్ట్రడామస్ జోస్యం నిజమవుతుందా ??

TTD: శేషాచలం అడవుల్లో మంటలు.. వీడియో ఇదిగో