Tata Motors: రక్షా బంధన్.. ఇది కేవలం పండుగ కాదు, దేశ రక్షకులైన డ్రైవర్లకు ఇచ్చే గౌరవం- టాటా మోటార్స్!
టాటా మోటార్స్ రక్షాబంధన్ సందర్భంగా ట్రక్ డ్రైవర్లకు ప్రత్యేక గౌరవం చూపింది. జంషెడ్‌పూర్ ప్లాంట్‌లోని మహిళా ఉద్యోగులు చేతితో రాఖీలు తయారు చేసి, నవీ ముంబైలోని డ్రైవర్లకు అందించారు. టాటా మోటార్స్ భద్రతాయుతమైన ట్రక్కులను తయారు చేయడంతో పాటు, డ్రైవర్ల భద్రతకు ప్రాధాన్యతనిస్తుందని ఈ చొరవ తెలియజేస్తుంది. ఇది కేవలం పండుగ కాదు, దేశ రక్షకులైన డ్రైవర్లకు ఇచ్చే గౌరవాన్ని తెలియజేసే కార్యక్రమంగా పేర్కొంది.
Raksha ka Bandhan నిత్యం రోడ్లపై నడిచే ఈ ట్రక్కులు కేవలం వస్తువులను మాత్రమే కాదు.. దేశం విశ్వాసాన్ని కూడా తీసుకువెళ్తాయి. ఆ ట్రక్కులు నడిపే డ్రైవరన్నలు ఈ దేశానికి నిజమైన రక్షకులు.. దేశాన్ని ముందుకు నడిపేందుకు వారు ప్రతీది పనంగా పెడతారు..అలాంటి డ్రైవరన్నల కోసం టాటా మోటార్స్ రక్షా బంధన్ సందర్భంగా ఒక ప్రత్యేక చొరవ తీసుకొని రక్షా కా బంధన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగనే.. టాటా మోటార్స్ జంషెడ్‌పూర్ ప్లాంట్‌లోని దుర్గా లైన్‌లో దేశంలోనే అత్యంత నమ్మకమైన, సురక్షితమైన ట్రక్కులను తయారు మహిళా సిబ్బంది.. ఈ ట్రక్కులను నడిపే డ్రైవర్ అన్నల కోసం ప్రత్యేకంగా తమ చేతులతో రాఖీలు తయారు చేశారు. రాఖీతో పాటు హృదయపూర్వక సందేశాలను రాశారు. ఈ రాఖీలు వందల కిలోమీటర్లు ప్రయాణించి నవీ ముంబైలోని కలంబోలి ట్రాన్స్‌పోర్ట్ నగర్‌కు చేరుకున్నాయి. అక్కడున్న మహిళా సిబ్బంది దేశాన్ని అవిశ్రాంతంగా ముందుకు నడిపే డ్రైవర్లకు ఈ రాఖీలు కట్టారు.
టాటా మోటార్స్ తలపెట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంతో దుర్గాలెన్‌లో ఉన్న మహిళలు, ఎప్పుడూ ట్రక్ నడపని వారు.. ప్రతి రోజు రోడ్లపైకి వచ్చి దేశాన్ని ముందుకు నడిపించే డ్రైవర్ అన్న భద్రతకు బాధత్య వహించారు. అవే చేతులు హృదయంలోని ప్రేమతో ఒక తీగను తయారు చేశాయి.. అదే రక్షణ తీగ( రాఖీ).. ఇది ఎప్పుడూ మీరు సురక్షితంగా ఉండేలా చూస్తుంది అంటున్నారు సోదరీమణులు.. ఎందుకంటే మేము ఈ ట్రక్కులను భద్రతా, నమ్మకంతో నిర్మించామని చెబుతున్నారు.
ఇది కేవలం అనుబంధాల పండుగ మాత్రమే కాదు.. దేశంలోని ప్రతి ట్రక్ డ్రైవర్ సురక్షింతగా ఉండేలా చూసుకోవడానికి టాటా మోటార్స్ నిబద్ధత కలిగి ఉంది. క్రాష్-టెస్ట్డ్ చేయబడింది క్యాబిన్‌లు, ADAS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ , ఇలా ప్రతి ఫీచర్‌లో టాటా మోటార్స్ డ్రైవర్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే టాటా మోటార్స్‌కు, ప్రతి డ్రైవర్ ఒక కుటుంబం, వారి ప్రతి ప్రయాణం భద్రంగా ఉండాలన్న బ్రాండ్ లక్ష్యాన్ని గుర్తుచేస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

