పండగలకు స్వీట్స్ కొంటున్నారా..? మీకు షాకింగ్ న్యూస్
హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడుతున్నవ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. కుళ్లిపోయిన మాంసం, బూజు పట్టిన ఆహారం, ప్రమాదకర రసాయనాలు రంగులతో తయారవుతున్న స్వీట్లు, బేకరీ ఐటమ్స్ బయట పడడంతో విస్తు పోయే నిజాలు ఎన్నో వెలుగు చూసాయి. దీంతో పండగ పూట స్వీట్లు, పిల్లలకు బేకరీ ఐటమ్స్ కొనాలన్నా.. తినాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో రద్దీగా ఉండే తిరుపతిలో ఇప్పుడు కల్తీ ఆహారం పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వ్యాపారం చేస్తున్న కల్తీగాళ్ళ ఆగడాలకు హద్దుల్లేని పరిస్థితి నెలకొంది. ఎలాంటి లైసెన్సులు లేకుండానే ఆహార పదార్థాలు తయారీతోపాటు హోటళ్ళు, రెస్టారెంట్లను అపరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహిస్తున్నారు. తిరుపతిలో హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీలు, స్వీట్ స్టాల్స్, మ్యానుఫ్యాక్చర్ యూనిట్లపై ఆహార భద్రత, తూనికలు కొలతల శాఖ చేపట్టిన దాడులు విస్తు పోయే చేదు నిజాలను బయట పెట్టాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు 20 బృందాలుగా విడిపోయి చేసిన తనిఖీలు ఎన్నో విషయాలను బయటపెట్టాయి. పలు రెస్టారెంట్లు, హోటల్స్ లో జరిగిన తనిఖీల్లో అధికారులు కల్తీ, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించారు. పలు రెస్టారెంట్లలో ఆహార పదార్థాలను ముడి సరుకులను సీజ్ చేసిన అధికారులు 70 చోట్ల శాంపిల్స్ సేకరించారు. 15 కేసులు నమోదు చేశారు. రేణిగుంటలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న ఫ్రూట్ కేవ్స్ పరిశ్రమలో ఎలాంటి ప్రమాణాలు పాటించలేదని గుర్తించారు అధికారులు. ఈ మేరకు శ్యాంపుల్స్ సేకరించి నోటీసులు జారీ చేసారు.అపరిశుభ్రమైన వాతావరణంలో పరిమితికి మించి రంగులు వాడుతున్నారని గుర్తించారు. స్వీట్ స్టాల్స్ లో శాంపుల్స్ కలెక్ట్ చేశారు. చాలావరకు నిబంధనలు పాటించకుండానే స్వీట్లు తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు. రాఖీ పండుగ రోజు మిఠాయిలు కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్ గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నిమిషానికి లక్ష టికెట్లు.. బుకింగ్ కష్టాలకు చెక్
ప్రకృతిలో మరో అద్భుతం.. రాఖీపుష్పం ఎప్పుడైనా చూశారా ??
వామ్మో.. బాలిక ప్రాణం తీసిన సాలీడు
టైర్ పంక్చర్ మోసంపై అలర్ట్! అదేంటంటే
నాగబంధనం వేసిన గదిని తెరిచేది ఎప్పుడు? అనంత పద్మనాభ ఆలయ గది రహస్యం ఏంటి!
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

