వామ్మో.. బాలిక ప్రాణం తీసిన సాలీడు
పాము కాటు వల్ల ప్రాణాపాయం సంభవించే ఛాన్స్ ఉండొచ్చు. తేలు వంటివి కుడితే.. తీవ్రమైన నొప్పి ఉంటుందే తప్ప.. సాధారణంగా ప్రాణాపాయం ఉండదు. అయితే..తాజాగా.. సాలీడు కుట్టడం వల్ల ఓ బాలిక చనిపోయింది. తూర్పు అసోంలోని ఓ గ్రామంలో కోడిగుడ్లు తీసేందుకు వెదురు బుట్టలో చేయిపెట్టిన ఓ బాలికను సాలీడు కుట్టింది.
కాసేపటికే బాలిక చేయి బాగా వాచింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం ఆమెను మరో ఆసుపత్రికి తీసుకుపోవాలని సూచించారు. సదరు ఆసుపత్రికి తీసుకుపోయిన కాసేపటికే.. బాలిక కన్నుమూసింది. కాగా, ఈ ప్రాంతంలోని అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేయటం, అక్రమ మైనింగ్ వల్ల.. అక్కడ నివసించే విషపు సాలీళ్లు, ఇతర జంతువులు తమ ప్రాంతానికి వస్తున్నాయని స్థానికులు వాపోయారు. బాలిక శరీరం నుంచి రక్తం నమూనాలను సేకరించిన వైద్యులు వాటిని పరీక్షలకు పంపారు. గతేడాది బ్రిటన్ పౌరుడైన నైజెల్ హంట్ అటవీ ప్రాంతంలో పిక్నిక్ కి వెళ్లగా.. అతడి పొట్టను సాలీడు కుట్టింది. పెద్దగా నొప్పి లేకపోవడంతో అతను ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయాడు. మర్నాడు పొట్టపై దద్దురు, దురద వచ్చినా పట్టించుకోలేదు. తర్వాత కొన్నిరోజులకు సాలీడు కుట్టిన చోట గాయమైంది. వైద్యులు పరీక్షలు చేసి ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్ అని తేల్చారు. ఇలాంటి కేసుల్లో గాయమైన భాగంలో బ్యాక్టీరియా చేరి.. విషపూరిత పదార్థాలను విడుదల చేస్తూ.. ఆ ప్రాంతంలోని కండనంతా కుళ్లిపోయేలా చేస్తుందని డాక్టర్లు వివరించారు. వెంటనే సర్జరీ చేసి గాయాన్ని నయం చేశారు. సరైన సమయంలో వైద్యం అందకుంటే.. అతడు మరణించి ఉండేవాడని వైద్యులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టైర్ పంక్చర్ మోసంపై అలర్ట్! అదేంటంటే
నాగబంధనం వేసిన గదిని తెరిచేది ఎప్పుడు? అనంత పద్మనాభ ఆలయ గది రహస్యం ఏంటి!
అతిగా ఉప్పు తీసుకుంటున్నారా? హార్ట్ ఎటాక్ ముప్పు తప్పదా
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

