AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుడ్ని మొక్కేందుకు వెళ్లిన భక్తులకు ఊహించని షాక్

దేవుడ్ని మొక్కేందుకు వెళ్లిన భక్తులకు ఊహించని షాక్

Phani CH
|

Updated on: Aug 12, 2025 | 7:59 PM

Share

రాష్ట్రంలో మంత్రగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను ఆసరాగా చేసుకుని క్షుద్రపూజలకు పాల్పడుతున్నారు. సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో రద్దీగా ఉండే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి క్షేత్రం పరిసరాల్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి.. ప్రధాన గుడి వెనుక వైపు హనుమాన్ టెంపుల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నల్లకోడిని బలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించాయి.

ఇది భక్తులను, స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ క్షుద్ర పూజలు ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి గుడి వెనక వైపు హనుమాన్ టెంపుల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. గుడి ముందు ప్రధాన రహదారిపై నల్లకోడిని బలిచ్చి పూజలు నిర్వహించిన సామాగ్రిని రహదారి పైన వదిలి వెళ్లారు.. ఆ మార్గంలో వెళ్తున్న భక్తులు నల్లకోడిని బలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు చూసి తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పుణ్య క్షేత్రంలో ఎవరు క్షుద్రపూజలు నిర్వహించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముఖ్యమంత్రి పేరును మర్చిపోయా క్షమించండి..

అభిమాని మూగ అభిమానం.. కరిగిపోయి కోరిక తీర్చిన NTR

అడ్వాన్స్ బుకింగ్స్‏లో వార్ 2 ఆల్ టైమ్ రికార్డ్..

జపాన్‌ లోకల్ ట్రైన్‌లో NTR క్రేజ్‌.. అవాక్కవుతున్న ఇండియన్స్‌

మెట్రో రైల్‌ పై కూలీ పోస్టర్.. దెబ్బకు దడదడలాడించిన NTR ఫ్యాన్స్‌