SSLV-D3 Live: శ్రీహరి కోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3.. లైవ్.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో కొత్త రాకెట్ SSLV D3 నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అలాగే, EOS-08 మిషన్‌గా కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను ప్రయోగించారు. సరిగ్గా శుక్రవారం(ఆగస్ట్ 16) ఉదయం 9:17 గంటలకు ప్రయోగించారు. ఈ ఉపగ్రహం విపత్తుల గురించి హెచ్చరికలు ఇస్తుంది.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో కొత్త రాకెట్ SSLV D3 నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అలాగే, EOS-08 మిషన్‌గా కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను ప్రయోగించారు. సరిగ్గా శుక్రవారం(ఆగస్ట్ 16) ఉదయం 9:17 గంటలకు ప్రయోగించారు. ఈ ఉపగ్రహం విపత్తుల గురించి హెచ్చరికలు ఇస్తుంది. ఇది SSLV చివరి రాకెట్ కావడం విశేషం. పర్యావరణం, ప్రకృత్తి విపత్తులు, అగ్ని పర్వతాలపై ఇది పర్యవేక్షించనుంది. ఈ ప్రయోగం మొత్తం 17 నిమిషాలపాటు సాగింది. ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో ఈవోఎస్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ (ఈవోఐఆర్) పేలోడ్ మిడ్-వేవ్, లాంగ్ వేవ్ ఇన్‌ఫ్రా-రెడ్‌లో చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత ఇస్రో రాకెట్ ప్రయోగించింది. 2024లో బెంగళూరు ప్రధాన కార్యాలయమైన అంతరిక్ష సంస్థ జనవరి 1న PSLV-C58/XPoSat మిషన్‌ను, ఫిబ్రవరి 17న GSLV-F14/INSAT-3DS మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

