ICC రూల్స్ తెలియని పాకిస్థాన్ బ్యాటర్.. ఔటై పెవిలియన్‌కు

|

Nov 05, 2022 | 9:22 AM

టీ20 ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యా్చ్‌లో సౌతాఫ్రికాపై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.

టీ20 ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యా్చ్‌లో సౌతాఫ్రికాపై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో మహ్మద్ నవాజ్ ఐసీసీ రూల్స్ తెలియకపోవడంతో ఔటై పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన సౌతాఫ్రికా బౌలర్ షంసీ చివరి బంతికి నవాజ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చున్నాడు. ఎల్బీ కోసం అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. బంతి బ్యాట్ ఎడ్జ్‌‌ను తాకిన తర్వాత ప్యాడ్లకు తాకింది. క్రీజ్ వదిలి రన్ కోసం ప్రయత్నించిన నవాజ్‌ను అదే బంతికి సౌతాఫ్రికా ఫీల్డర్లు రనౌట్ చేశారు. దీంతో తాను రనౌట్ అయ్యానని భావించిన నవాజ్.. బ్యాట్ ఎడ్జ్ తాకినా కూడా రివ్యూ కోరకుండానే.. మైదానాన్ని వీడాడు. ఇదిలావుంటే, ఐసీసీ రూల్స్ ప్రకారం అంపైర్ ఔటిచ్చాక బంతి డెడ్ బాల్ అవుతుంది. అంటే అప్పుడు పరుగు తీయడం, రనౌట్ చేయడం లాంటివి కుదరవు. కానీ నిబంధనలు తెలియకపోవడమో లేదా సరైన సమయంలో గుర్తుకు రాకపోవడమో గానీ.. నవాజ్ మాత్రం పెవిలియన్ చేరాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ramcharan: ఐరన్ మ్యాన్‌ సిరీస్‌లో రామ్‌ చరణ్ కీ రోల్‌

ప్రభాస్ చేతిలో.. ఘోరంగా ఓడిపోయిన షారుఖ్.. డార్లింగ్ దెబ్బకు బాలీవుడ్ షేక్

Chiranjeevi: ఆ ఫేక్ న్యూస్‌లే చిరును ఇబ్బంది పెడుతున్నాయి

S. S.Rajamouli: పాపం!! రాజమౌళి శ్రమకు.. ఇప్పుడు ఫలితం దొరికింది

అటు మెగాస్టార్.. ఇటు రాపో.. ఇది కదా బ్యూటిఫుల్ సీన్

Published on: Nov 05, 2022 09:22 AM