పాఫం! మూడ్నాళ్ల ముచ్చటే.. ఈయన ముదురు ప్రేమ కథ!

పాఫం! మూడ్నాళ్ల ముచ్చటే.. ఈయన ముదురు ప్రేమ కథ!

Venkata Chari

|

Updated on: Jan 16, 2023 | 4:16 PM

ప్రేమంటే, ఓ ఆట ఆడాళ్లకి..! వెనువెంటే వస్తారు టైం పాస్కి.! అదే ప్రేమని నమ్మి మగధీరులు.. సదా కాల్చుకుంటారు తమ గుండెలు..! సో..! జాగ్రత్త.. బీ కేర్‌ ఫుల్.. పారాహుషార్! ఇది ఇప్పుడు మీకో డైలాగ్‌లా వినిపిస్తున్నా.. ఇదో ఫేమస్ సాంగ్. చిరునవ్వుతో సినిమాలోని లవ్‌ ఫెయిల్యూర్ సాంగ్. ఇక ఈ సాంగే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మ్యాచ్‌ అవుతోంది బిజినెస్ మ్యాన్ లలిత్ మోదీ.. సుస్మితా సేన్ ప్రేమ కహానీతో..!



బిజినెస్ మ్యాన్ గా వెరీ పాపులర్ అండ్ సక్సెస్ ఫుల్… మనీలాండరింగ్ కేసులో అక్యూస్‌డ్‌! ఇండియా నుంచి అబ్‌స్కాండ్..! అయిన లలిత్ మోదీ.. చాల యేళ్ల తర్వాత… బాలీవుడ్ స్టార్ హీరోయిన్తో కాస్త ఇంటమిసీగా ఉన్న ఫోటోల్లో కనిపించారు. తను సుస్మితా సేన్‌తో డేట్‌లో ఉన్నట్టు.. ప్రేమలో ఉన్నట్టు అనౌన్స్ చేశారు. నెట్టింట తెగ వైరల్ అయ్యారు. సుస్మితా సేన్ అభిమానులతో పాటు.. బీ టౌన్ సెలబ్రిటీలను షాక్ చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు హాస్పటిల్లో వెంటిలేటర్ పై ఉన్నారు.

Published on: Jan 16, 2023 04:16 PM