Rohit Sharma: T20 క్రికెట్‌లో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ అరుదైన రికార్డ్‌.! 100 విజ‌యాల్లో క్రికెట‌ర్‌.

Rohit Sharma: T20 క్రికెట్‌లో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ అరుదైన రికార్డ్‌.! 100 విజ‌యాల్లో క్రికెట‌ర్‌.

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Jan 17, 2024 | 8:30 AM

భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ T20 క్రికెట్‌లో అరుదైన రికార్డ్‌ నమోదు చేశాడు. పురుషుల‌ టీ20ల్లో అత్య‌ధికంగా 100 విజ‌యాల్లో భాగ‌మైన క్రికెట‌ర్‌గా హిట్‌మ్యాన్ చ‌రిత్ర సృష్టించాడు. స్వ‌దేశంలో అఫ్గ‌నిస్థాన్‌తో జ‌రిగిన తొలి టీ20లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. దాంతో, రోహిత్ విజ‌యాల సెంచ‌రీ కొట్టేశాడు. పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండ‌ర్ షోయ‌బ్ మాలిక్ రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ 73, ఇక అఫ్గ‌నిస్థాన్ మాజీ సార‌థి మ‌హ్మ‌ద్ న‌బీ 70 విజ‌యాల‌తో వ‌రుస‌గా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ T20 క్రికెట్‌లో అరుదైన రికార్డ్‌ నమోదు చేశాడు. పురుషుల‌ టీ20ల్లో అత్య‌ధికంగా 100 విజ‌యాల్లో భాగ‌మైన క్రికెట‌ర్‌గా హిట్‌మ్యాన్ చ‌రిత్ర సృష్టించాడు. స్వ‌దేశంలో అఫ్గ‌నిస్థాన్‌తో జ‌రిగిన తొలి టీ20లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. దాంతో, రోహిత్ విజ‌యాల సెంచ‌రీ కొట్టేశాడు. పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండ‌ర్ షోయ‌బ్ మాలిక్ రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ 73, ఇక అఫ్గ‌నిస్థాన్ మాజీ సార‌థి మ‌హ్మ‌ద్ న‌బీ 70 విజ‌యాల‌తో వ‌రుస‌గా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. పాక్ మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్ 70 విజ‌యాల‌తో ఐదో స్థానం ద‌క్కించుకున్నాడు. మహిళా క్రికెట్‌ టీ20ల్లో ఇంగ్లండ్ బ్యాట‌ర్ డానీ వ్యాట్ 111 విక్ట‌రీల‌తో టాప్‌లో ఉంది. ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హేలీ, ఆల్‌రౌండ‌ర్ ఎలీసా పెర్రీలు 100 విజ‌యాల‌తో సంయుక్తంగా రెండో స్థానంలో కొన‌సాగుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos