Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం సెక్యూరిటీ చెంప పగలగొట్టిన లోకల్ ఎస్పీ ఆ వెంటనే అతను ఏం చేశాడో తెలుసా.. ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 26, 2021 | 6:12 PM

హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు పోలీసుల మధ్య చిన్న గొడవ పెద్ద రచ్చగా మారింది. భుంటార్ విమానాశ్రయం సమీపంలో కులు జిల్లా పోలీసు సిబ్బంది..

హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు పోలీసుల మధ్య చిన్న గొడవ పెద్ద రచ్చగా మారింది. భుంటార్ విమానాశ్రయం సమీపంలో కులు జిల్లా పోలీసు సిబ్బంది.. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ భద్రతా సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ మాటలు కాస్త పెద్దవై చేయి చేసుకునే వరకూ వెళ్లాయి. ఇది రెండు విభాగాల మధ్య కలకలం రేపింది. ఈ ఘటనలో ఇందులో పోలీసు సూపరింటెండెంట్, అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఉన్నారు. ఈ వీడియోలో కులు ఎస్పీ గౌరవ్ సింగ్ ఎఎస్పీ బ్రిజేష్ సూద్‌ను చెంపదెబ్బ కొట్టడం వైరల్‌గా మారింది. ఎఎస్పీ బ్రిజేష్ సూద్‌ ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఇన్‌ఛార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. సెక్యూరిటీ విషయంలో మాటా మాట పెరిగింది. దీనిపై ముఖ్యమంత్రి వ్యక్తిగత భద్రతా అధికారిని స్థానిక ఎస్పీని కొట్టాడు. సీఎం జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల పర్యటన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సిమ్లాలోని పోలీసు ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:  Gold And Silver Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట… దిగివస్తున్న బంగారం ధరలు… ( వీడియో )

Sonu Sood Supermarket: సోనూ సూద్ సూపర్ మార్కెట్.. అన్నీ హోమ్‌ డెలివరీనే.. ( వీడియో )