Hyderabad: అప్పటివరకు గణపతి ముందు డ్యాన్స్.. ఇంటికెళ్లగానే హార్ట్ అటాక్
కరోనా తర్వాత అందరి హెల్త్ తేడా వచ్చేసిందా..! డాన్సులు, ఆటల్లో బాగా అలసిపోతే.. ఆ ఎఫెక్ట్ ఇమ్మీడియట్‌గా హార్ట్‌పై పడుతోందా..! ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన చూస్తే.. ఇలాంటి టెన్షనే వస్తోంది.. వినాయక నిమజ్జనం సందర్భంగా అప్పటివరకూ శోభాయాత్రలో స్టెప్పులు వేసిన వ్యక్తి.. ఇంటికెళ్లి కుప్పకూలిపోయాడు.. హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు.. ఇదే ఇప్పుడు షాకింగ్..
రంగారెడ్డి జిల్లా మణికొండ అల్కాపురికాలనీలో విషాదం చోటుచేసుకుంది. రాత్రి అల్కాపురి కాలనీ గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న శ్యామ్‌ప్రసాద్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గుండెపోటుతో మృతి చెందారు. అల్కాపురి టౌన్‌షిప్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం దగ్గర లడ్డూ వేలం పాట కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలం పాటలో లడ్డూ కైవసం చేసుకున్న తన స్నేహితుడి ముందు తీన్‌మార్ స్టెప్పులు వేశారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన శ్యామ్ ప్రసాద్ ఒక్కసారి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. అంతకుముందు.. తాను కూడా లడ్డూ వేలం పాటలో పాల్గొన్నారు. 15 లక్షల వరకు లడ్డూ వేలం పాట పాడారు శ్యామ్‌ప్రసాద్. చివరికి స్నేహితుడు అంతకంటే ఎక్కువకు పాడి లడ్డూ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా అందరితో కలిసి సరదగా డాన్సులు చేశారు.. కాసేపటికి ఇంటికి వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.