NTR – Devara: హాలీవుడ్​ లో ‘దేవర’ ఫీవర్.. అమెరికాకు జూనియర్ ఎన్​టీఆర్ పయనం.?

జూనియర్ ఎన్​టీఆర్ అప్​కమింగ్ మూవీ 'దేవర' ఇప్పుడు అమెరికా వేదికగా ఓ అరుదైన రికార్డును అందుకోనుంది. జూ. ఎన్​టీఆర్, కొరటాల శివ కాంబినేషన్​లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'దేవర' త్వరలో అభిమానుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి అందరిలోనూ భారీగానే అంచనాలు ఉన్నాయి. ట్రైలర్​, సాంగ్స్​ ఇలా ఈ చిత్రానికి సంబంధించిన పలు పాయింట్స్ ఆకట్టుకోవడం వల్ల ఫ్యాన్స్ కూడా ఈ సినిమా గురించి ఓ రేంజ్​లో వెయిట్ చేస్తున్నారు.

NTR - Devara: హాలీవుడ్​ లో 'దేవర' ఫీవర్.. అమెరికాకు జూనియర్ ఎన్​టీఆర్ పయనం.?

|

Updated on: Sep 16, 2024 | 12:12 PM

జూనియర్ ఎన్​టీఆర్ అప్​కమింగ్ మూవీ ‘దేవర’ ఇప్పుడు అమెరికా వేదికగా ఓ అరుదైన రికార్డును అందుకోనుంది. జూ. ఎన్​టీఆర్, కొరటాల శివ కాంబినేషన్​లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘దేవర’ త్వరలో అభిమానుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి అందరిలోనూ భారీగానే అంచనాలు ఉన్నాయి. ట్రైలర్​, సాంగ్స్​ ఇలా ఈ చిత్రానికి సంబంధించిన పలు పాయింట్స్ ఆకట్టుకోవడం వల్ల ఫ్యాన్స్ కూడా ఈ సినిమా గురించి ఓ రేంజ్​లో వెయిట్ చేస్తున్నారు. రిలీజ్​కు ముందు నుంచే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్న ‘దేవర’ తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. లాస్‌ ఏంజెలిస్‌ వేదికగా ప్రారంభం కానున్న అతిపెద్ద ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ‘బియాండ్‌ ఫెస్ట్‌’లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 9 వరకు ఈ ఈవెంట్ జరగనుండగా, సెప్టెంబర్‌ 26 సాయంత్రం థియేటర్‌లో అక్కడి ప్రేక్షకులతో పాటు ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని వీక్షించనున్నారు. ఇక ఈ సినిమా ఈవెంట్​ కోసం జూనియర్ ఎన్​టీఆర్​ సెప్టెంబర్‌ 25న అమెరికా వెళ్లనున్నారని సినీవర్గాల మాట.

ఇక ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ జారీ చేసింది. కాగా, సినిమా రన్​టైమ్​ 2 గంటల 57 నిమిషాలు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్​తో తీసిన సినిమా కావడం వల్ల దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక మూవీలో విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాల సినిమా హైలైట్‌ అని హీరో ఎన్టీఆర్ ముంబయిలో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అంచనాలు రెట్టింపు చేశారు. ఇటీవలే ఓవర్సీస్‌లో ఈ మూవీ ప్రీసేల్‌ టికెట్‌ బుకింగ్స్​లో భాగంగా వన్‌ మిలియన్‌ సేల్ చేసింది. ఈ క్రమంలో నార్త్‌ అమెరికన్‌ బాక్సాఫీస్‌ వద్ద అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్‌ ద్వారా వన్‌ మిలియన్‌ మార్క్‌ దాటిన సినిమాగా రికార్డుకెక్కింది. అంతేకాకుండా ట్రైలర్‌ రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగానూ రికార్డు నెలకొల్పింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us