కాళ్ల పారాణి ఆరకముందే.. కానరాని లోకాలకు
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఓ నవ దంపతుల జీవితాన్ని విషాదంలోకి నెట్టింది. పెళ్లి అయిన కొద్దిరోజులకే సాయికుమార్, ప్రణతిలు ఉద్యోగం నిమిత్తం వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో వధువు ప్రణతి అక్కడికక్కడే మృతి చెందింది. వరుడు సాయికుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాద ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన జంట ఆనందాన్ని రోడ్డు ప్రమాదం వేరుచేసింది.. ఘోర రోడ్డు ప్రమాదంలో వధువు అక్కడే మృతి చెందగా.. వరుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. ఎన్నో ఆశలతో ఇద్దరూ పెళ్లి చేసుకోగా.. వారిని అనుకోని రోడ్డు ప్రమాదం వీడదీయడంతో.. ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మీరు దొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చేప్యాలకు చెందిన సాయికుమార్, ప్రణతి లకు ఇటీవల వివాహమైంది. ఈ క్రమంలో ప్రణతి, సాయికుమార్ లు ఉద్యోగం నిమిత్తం సిద్ధిపేట నుంచి టూవీలర్ పై హైదరాబాద్ బయలుదేరగా.. వెనుకనుంచి ఓ ట్రాక్టర్ అదుపు తప్పివేగంగా వచ్చి వీరి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్సులో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. వధువు ప్రణతి దారిలోనే మృతి చెందింది. ప్రస్తుతం సాయికుమార్ కి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ దంపతుల కలలు కల్లలయ్యాయి. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతిచెందడంతో చేప్యాల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్డు ఏ టైంలో తింటే మంచిది.. ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం
అంబేద్కర్ పేరునూ సహించలేరా ?? కోనసీమ జిల్లా పేరుపై మరోసారి రగడ
బైకర్‌ను ఆపిన ట్రాఫిక్ పోలీస్.. అతని బైక్‌పై ఉన్న చలాన్లు చూసి షాక్
ఊరంతా ఒకే చోటే భోజనం వందల ఏళ్ల నాటి సంప్రదాయం
40 సార్లు ఫారిన్ ట్రిప్పులు.. 5 ఏళ్లలో రూ.100 కోట్లు.. ఐబొమ్మ రవి లగ్జరీ లైఫ్ ను చూస్తే
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం

