Shocking Video: తప్పిన పెను ప్రమాదం.. అతనే గనుక అలర్ట్‌గా లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..
Shocking Video: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, కొన్ని వీడియోలు మాత్రం చూసిన వెంటనే షాక్ అవుతాం.
Shocking Video: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, కొన్ని వీడియోలు మాత్రం చూసిన వెంటనే షాక్ అవుతాం. కళ్లు అలాగే తెరిచి ఉంచేలా చేస్తాయి. అంతేకాదు.. ప్రజల హృదయాలను టచ్ చేస్తాయి. తాజాగా ఇలాంటి వీడియోను ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే పక్కా రోమాలు నిక్కబొడుస్తాయంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు.. ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని ప్రశంసించకుండా ఉండలేరు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. రహదారిపై వాహనాలు రయ్ రయ్ మంటూ వెళ్తున్నాయి. గ్యాప్ లేకుండా వరుసగా కార్లు, బైక్‌లు దూసుకువెళ్తున్నాయి. ఇంతలో ఓ యువతి, ఓ వ్యక్తి వచ్చి రోడ్ దాటేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వాహనాలు వరుసగా వస్తుండటంతో వేచి చూస్తున్నారు. అయితే రోడ్డు అవతలి వైపున ఓ వ్యక్తితో పాటు చిన్నారి కూడా ఉంది. ఆ చిన్నారి అతని చేయి వదిలిపెట్టి రోడ్డుపై వస్తున్న బండ్లను చూసుకోకుండా ఒక్కసారిగా రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. అప్పటకే ఓ కారు వేగంగా వస్తోంది. ఇటు కారును, అటు చిన్నారి రాకను గమనించి రోడ్డుకు ఇవతలి వైపు ఉన్న వ్యక్తి.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్షణాల్లో పరుగెత్తి ఆ చిన్నారిని రక్షించాడు. కారు వారిని దాటిపోయింది. సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురవకమానదు. అతనే గనుక అప్రమత్తంగా లేకుండా ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉండే ఊహిస్తేనే భయానకంగా ఉంది. మరి ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.
A little girl. And a stranger with no hesitation whatsoever.
Not all heroes wear capes… pic.twitter.com/EO22qLTfMF
— Rex Chapman?? (@RexChapman) June 4, 2021
Also read: