Shantiniketan Vidyalaya: శాంతినికేతన్ విద్యాలయంలో 25వ యాన్యువల్‌ డే.! ముఖ్య అతిథిగా శ్రీత్రిదండి చిన జీయర్‌స్వామి.

Shantiniketan Vidyalaya: శాంతినికేతన్ విద్యాలయంలో 25వ యాన్యువల్‌ డే.! ముఖ్య అతిథిగా శ్రీత్రిదండి చిన జీయర్‌స్వామి.

Anil kumar poka

|

Updated on: Feb 08, 2024 | 11:00 AM

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌ మండలం శాంతినికేతన్ విద్యాలయంలో 25వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన జీయర్‌స్వామి తన ప్రసంగంతో విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు అలరించారు. 25 సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం స్వామీజీ యాన్యువల్‌ డే వేడుకకు విచ్చేస్తున్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. ఇది అప్పటి నుంచీ ఆనవాయితీగా వస్తోంది.

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌ మండలం శాంతినికేతన్ విద్యాలయంలో 25వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన జీయర్‌స్వామి తన ప్రసంగంతో విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు అలరించారు. 25 సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం స్వామీజీ యాన్యువల్‌ డే వేడుకకు విచ్చేస్తున్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. ఇది అప్పటి నుంచీ ఆనవాయితీగా వస్తోంది. ఐఏఎస్‌ అధికారి యశ్వంత్‌ శాంతినికేతన్ విద్యాలయం పూర్వ విద్యార్థి కావడం విశేషం. 780 మంది విద్యార్థులు ఇక్కడే బస చేస్తారు. గత ఎనిమిదేళ్లుగా బెస్ట్‌ రెసిడెన్షియల్ స్కూల్‌ అవార్డును సొంతం చేసుకుంది శాంతినికేతన్‌ విద్యాలయం. ఐదు బ్రాంచ్‌లతో వంద శాతం బోర్డింగ్‌ స్కూల్‌గా పేరు పొందింది. 25 ఎకరాల క్యాంపస్‌లో స్కేటింగ్‌ రింగ్, స్విమ్మింగ్‌ పూల్‌ సహా ఎన్నో ఇతర సౌకర్యాలు ఉన్నాయని స్కూల్‌ డైరెక్టర్‌ పురుషోత్తం తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..