UNSC Meeting: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తొలిసారిగా రష్యా మారణ హోమంపై స్పందించిన భారత్!

|

Apr 06, 2022 | 8:07 AM

ఉక్రెయిన్‌లోని బుచా నగరంలో పౌరులను దారుణంగా చంపిన సంఘటనను భారతదేశం ఖండించింది. ఈ దారుణంపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్.. న్యాయమైన విచారణకు మద్దతు ఇచ్చింది.

UNSC Meeting: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తొలిసారిగా రష్యా మారణ హోమంపై స్పందించిన భారత్!
Russia Ikraine War
Follow us on

UNSC meeting on Ukraine: ఉక్రెయిన్‌లోని బుచా(Bucha) నగరంలో పౌరులను దారుణంగా చంపిన సంఘటనను భారతదేశం(India) ఖండించింది. ఈ దారుణంపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్.. న్యాయమైన విచారణకు మద్దతు ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తొలిసారిగా రష్యాపై భారత్ స్పందించింది. కౌన్సిల్‌లోని భారత రాయబారి TS తిరుమూర్తి మాట్లాడుతూ, “బూచాలో పౌర హత్యల గురించి ఇటీవలి నివేదికలు చాలా కలవరపెడుతున్నాయి. మేము ఈ హత్యలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాము. స్వతంత్ర దర్యాప్తుకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము.” హింసను తక్షణమే ఆపివేయాలని, శత్రుత్వాలకు స్వస్తి చెప్పాలని ఆయన తన పిలుపునిచ్చారు.

ఉక్రెయిన్‌లో పరిస్థితి దిగజారడం పట్ల భారతదేశం తీవ్ర ఆందోళన చెందుతోందని తిరుమూర్తి అన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావం ఇప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోందన్నారు. దీంతో ఆహార పదార్థాలు, ఇంధనం ఖరీదు అవుతున్నాయి. దీని ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎక్కువగా పడుతోంది. “అమాయకుల జీవితాలు ప్రమాదంలో ఉన్నప్పుడు, దౌత్యపరమైన చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి.” అని తిరుమూర్తి స్పష్టం చేశారు.


ఇదిలావుంటే, బుచా ఊచకోతపై అమెరికా దాని ఇతర మిత్రదేశాలు రష్యా ముట్టడిని తీవ్రతరం చేశాయి. బ్రిటన్ రష్యా పౌరులకు కూడా విజ్ఞప్తి చేసింది. తమ ప్రభుత్వం నుండి నిజం తెలుసుకోవాలని అన్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పుతిన్ తన పౌరుల నుండి సత్యాన్ని దాచారని ఆరోపించారు. మరోవైపు, కౌన్సిల్‌ను ఉద్దేశించి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ, బుచాలో పౌరులను చంపిన భయానక చిత్రాలను మరచిపోలేమని అన్నారు. సమర్థవంతమైన జవాబుదారీతనం ఉండేలా తక్షణమే నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన కోరారు. అమెరికా అధ్యక్షుడు బిడెన్ కూడా రష్యా చర్యను తీవ్రంగా ఖండిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదే సమయంలో, బుచ్చా హత్యాకాండకు సంబంధించిన వీడియో కూడా వీటన్నింటి మధ్యలో బయటపడింది. ఈ వీడియో మార్చి 3కి సంబంధించినది. డ్రోన్ నుంచి తీసిన ఈ వీడియోలో సైకిల్ తొక్కుతున్న వ్యక్తి కనిపిస్తున్నాడు. కొంత దూరం నడిచిన తర్వాత, ఈ వ్యక్తి రష్యన్ సైన్యం సాయుధ వాహనాలు ఉన్న వైపుకు తిరుగుతాడు. ఆ వ్యక్తి తిరిగిన వెంటనే, సైన్యం అతనిపై దాడి చేస్తుంది. దాడి తర్వాత సైక్లిస్ట్ ఎక్కడా కనిపించలేదు. ఇలాంటి హృదయవిదాకర ఘటనలు ఎన్ని చోటుచేసుకున్నట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. చిన్నారులతో సహా వందలాది మందిని నిదాక్షిణ్యంగా హతమార్చరని అధికారులు ప్రకటించారు.

Read Also….  Karnataka CM: బెంగళూరును హైదరాబాద్‌తో పోల్చడం హాస్యాస్పదం.. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక సీఎం