News Watch: తెలంగాణలోకి రాహుల్ భారత్ జోడో యాత్ర ఎంట్రీ.. మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Edited By: Ravi Kiran

Updated on: Oct 23, 2022 | 7:53 AM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మరికాసేపట్లో తెలంగాణలోకి ప్రవేశించనుంది. మహబూబ్ నగర్ మక్తల్ గుడి బెల్లూరు నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం కర్ణాటకలోని రాయచూర్ ఎరసూర్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం కృష్ణా నదిపైనున్న బ్రిడ్జి నుంచి తెలంగాణలోకి ప్రవేశించనున్నారు. తెలంగాణలో తొలిరోజు 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం తెలంగాణలోకి ప్రవేశించనుంది. మక్తల్ గుడి బెల్లూరు నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం కర్ణాటకలోని రాయచూర్ ఎరసూర్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం కృష్ణా నదిపైనున్న బ్రిడ్జి నుంచి తెలంగాణలోకి ప్రవేశించనున్నారు. తెలంగాణలో తొలిరోజు 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. గుడి బెల్లూరులో పాదయాత్ర ప్రారంభించడంతోపాటు.. రాహుల్ 10గంటలకు సభలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింభించేలా రాహుల్‌ను స్వాగతించనున్నారు. ముందుగా తెలంగాణలోకి ప్రవేశించేముందు.. రాహుల్ గాంధీకి జాతీయ జెండాను అందించి కాంగ్రెస్ శ్రేణులు.. స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే.. భారీగా చేరుకున్నారు. మూడు రోజుల బ్రేక్ అనంతరం రాహుల్ భారత్ జోడో యాత్ర 27 నుంచి తెలంగాణలో కొనసాగనుంది. దీనికోసం ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా ఖరారైంది. మొత్తం 13 రోజుల పాటు 375 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్ర.. మక్తల్‌ నుంచి హైదరాబాద్ మీదుగా మద్నూర్ వరకు కొనసాగనుంది. నవంబర్ 7 వరకు పాదయాత్ర కొనసాగనుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

JR NTR: బ్రాండ్ అంటే.. ఇది సర్ !! ఒరిజినల్ అంతే..

జక్కన్న పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఏఆర్‌ రెహమాన్‌.. ఏంటంటే ??

Kantara: ఆ ఒక్క సీనే.. థియేటర్‌ దద్దరిల్లేలా చేస్తోంది..

Kajal Aggarwal: కాజల్‌ ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌.. నీల్‌ని ఉద్దేశిస్తూ

రెస్టారెంట్ కి వెళ్లిన జో బైడెన్ కు.. షాకిచ్చిన క్యాషియర్

డబ్బులు ఇచ్చే ఏటీఎం కాదు… ఇడ్లీలు ఇచ్చే ఏటీఎం.. చట్నీ, కారప్పొడితో

Published on: Oct 23, 2022 07:46 AM