Pawan Kalyan: పొలిటికల్ క్రాస్‌రోడ్స్‌లో పవన్ కల్యాణ్ !! పొత్తులపై తేల్చుకోలేకపోతున్న జనసేన
వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. బీజేపీ ఆలోచన కూడా ఇదే అని చెబుతున్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. జనసేన మిత్రపక్షంగా ఉన్న బీజేపీ మాత్రం సేమ్ టు సేమ్ డైలాగ్ చెప్పదు. జనసేన మాతోనే ఉంది.. ఎన్నికలకు మా రెండు పార్టీలే కలిసి వెళ్తాయనేది కమలనాథుల టోన్.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. బీజేపీ ఆలోచన కూడా ఇదే అని చెబుతున్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. జనసేన మిత్రపక్షంగా ఉన్న బీజేపీ మాత్రం సేమ్ టు సేమ్ డైలాగ్ చెప్పదు. జనసేన మాతోనే ఉంది.. ఎన్నికలకు మా రెండు పార్టీలే కలిసి వెళ్తాయనేది కమలనాథుల టోన్. ఇక్కడే మిత్రపక్షాల ఆలోచనల్లో.. మాటల్లో కనెక్టివిటీ కనిపించడం లేదు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ కల్యాణ్ చెప్పడం వెనుక మర్మం ఎంటో పొలిటికల్ వర్గాలకు తెలుసు. జనసేనాని టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని.. బీజేపీని కూడా కలుపుకొని సాగాలని అనుకుంటున్నారు. కానీ.. టీడీపీతో కలిసి సాగేందుకు బీజేపీ ఒప్పుకొంటుందా అనేది పెద్ద ప్రశ్న. ఈ అంశం చుట్టూనే కొద్దిరోజులుగా చర్చ సాగుతోంది. టీడీపీ- జనసేన మధ్య పొత్తులపై అధికారిక ప్రకటనే మిగిలిందని.. బీజేపీకి పవన్ కల్యాణ్ రాంరాం చెప్పడమే తరువాయి అని నిన్న మొన్నటి వరకు అనుకున్నారు. ఇంతలోనే సడెన్‌గా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో సమావేశం అయ్యారు పవన్ కల్యాణ్. టీడీపీ ప్రతినిధిగా.. పొత్తులు అనే సింగిల్ అజెండాతోనే పవన్ కల్యాణ్ హస్తిన వెళ్లి బీజేపీ హైకమాండ్ పెద్దలు నడ్డా తదితరులతో మాట్లాడినట్టు ప్రచారం జరిగింది. అయితే బీజేపీ అగ్రనాయకత్వంతో జరిగిన చర్చల ఔట్ కమ్ ఏంటో.. పవన్ కల్యాణ్ చేసిన ప్రతిపాదనలకు కమలనాథులు ఓకే చెప్పారో లేదో క్లారిటీ లేదు. పైపెచ్చు.. పవన్ కల్యాణ్ మరింత గందరగోళంలో పడ్డారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రిలీజ్‌కు ముందే 40 కోట్లు.. ఓరేంజ్‌లో.. నిఖిల్ రేంజ్
దిమ్మతిరిగే తుఫాన్ ఆన్‌ద వే.. జపాన్‌లో రిలీజ్‌కు రంగస్థలం..
అయిపోయాడు.. మళ్లీ ట్రోలర్స్‌కు దొరికిపోయాడు
బన్నీ ఫ్యాన్స్ దాటికి.. చిరిగిన 70MM స్క్రీన్
థియేటర్లో చిచ్చుబుడ్డి కాల్చడం ఏంట్రా..