Chandrababu Naidu Arrest: ఏపీ రాజకీయాల్లో బిగ్గెస్ట్ పొలిటికల్ టర్న్.. సానుభూతి, వ్యతిరేకత.. అన్నీ చూసే అరెస్టా?

|

Sep 09, 2023 | 10:10 PM

Weekend Hour With Murali Krishna: ఏపీ పాలిటిక్స్‌లో ఎన్నడూ చూడని సీరియస్‌ ఎపిసోడ్‌ నడుస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో పక్కా ఆధారాలు ఉన్నాయంటూ మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేశారు. కాసేపట్లో ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నారు. అయితే, ఈ అరెస్ట్‌ వ్యవహారం ఎలాంటి టర్న్ తీసుకోబోతోందనేదే ఇంట్రస్టింగ్ ఫ్యాక్టర్. సానుభూతి రాకుండా వైసీపీ దగ్గర వ్యూహం ఏదైనా ఉందా? పొలిటికల్‌గా కూడా ఈ ఇష్యూని టీడీపీ మరింత ముందుకు తీసుకుపోతుందా? ఏపీ రాజకీయాల్లో ఇకపై జరగబోయేది ఏంటి?

Chandrababu Naidu Arrest: ఏపీ రాజకీయాల్లో బిగ్గెస్ట్ పొలిటికల్ టర్న్.. సానుభూతి, వ్యతిరేకత.. అన్నీ చూసే అరెస్టా?
Weekend Hour With Murali Krishna
Follow us on

Weekend Hour With Murali Krishna: ఏపీ పాలిటిక్స్‌లో ఎన్నడూ చూడని సీరియస్‌ ఎపిసోడ్‌ నడుస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో పక్కా ఆధారాలు ఉన్నాయంటూ మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేశారు. కాసేపట్లో ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నారు. అయితే, ఈ అరెస్ట్‌ వ్యవహారం ఎలాంటి టర్న్ తీసుకోబోతోందనేదే ఇంట్రస్టింగ్ ఫ్యాక్టర్. సానుభూతి రాకుండా వైసీపీ దగ్గర వ్యూహం ఏదైనా ఉందా? పొలిటికల్‌గా కూడా ఈ ఇష్యూని టీడీపీ మరింత ముందుకు తీసుకుపోతుందా? ఏపీ రాజకీయాల్లో ఇకపై జరగబోయేది ఏంటి?

తనను అరెస్ట్ చేయొచ్చు అని చంద్రబాబు అనడమే.. ఏదో జరగబోతోందనే సిగ్నల్ పంపింది. దానికి తగ్గట్టే వైసీపీ నేతలు కూడా రెండు మూడు రోజులుగా అరెస్ట్‌ గురించి మాట్లాడారు. ఫైనల్లీ పోలీసులు అర్ధరాత్రి బస్‌ డోర్‌ కొట్టారు, ఉదయానికల్లా చంద్రబాబును అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఇదీ జరిగిన కథ. ఈ మొత్తం ఎపిసోడ్‌ను 370 కోట్ల రూపాయల స్కామ్‌గా చూడడం కంటే రాజకీయ కోణంలోనే జనం చూస్తున్నారన్నది నిజం. వైసీపీ నేతల కామెంట్లు కూడా దీనికి మ్యాచ్ అవుతున్నాయి. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని మాకు తెలీదా అని కామెంట్‌ చేశారు మంత్రి అంబటి రాంబాబు.

స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాంలో డబ్బు ఎటు నుంచి ఎటువైపు వెళ్లిందని నిర్ధారించడంలో టైం పట్టింది తప్ప, ఇందులో రాజకీయ కక్ష ఏం లేదంటూ స్పష్టత ఇచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

ఇవి కూడా చదవండి

సహజంగానే.. ఇది రాజకీయ కక్ష సాధింపు అనే లైన్‌లో వెళ్లింది ప్రతిపక్ష టీడీపీ. రాజకీయ అంశాలను వ్యక్తిగత కక్షగా మార్చుకుని చంద్రబాబుపై పగ సాధిస్తున్నారని కామెంట్ చేశారు టీడీపీ ఎంపీ కనకమేడల. చంద్రబాబు అరెస్ట్‌ను పిరికిపంద చర్యగానే చూస్తాం తప్ప చట్టబద్ధమైన చర్యగా చూడబోం అని తేల్చి చెప్పారు.

ఇక అందరూ ఆసక్తిగా గమనించే అంశం.. దీనిపై పవన్‌ కల్యాణ్‌ ఏమంటారని. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారంటూ డైరెక్ట్‌ స్టేట్‌మెంట్ ఇచ్చారు జనసేన అధినేత. అసలు ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారనేది పవన్ కల్యాణ్‌ ప్రశ్న. చంద్రబాబు అరెస్ట్‌ ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపేనని ముగింపు ఇచ్చారు.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అరెస్ట్ చేసిన తీరును మాత్రమే ఖండించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేని వ్యక్తిని, కనీస వివరణ తీసుకోకుండా, ఓ నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారనేది పురంధేశ్వరి ప్రశ్న. స్కాం జరిగి ఉంటే.. నిబంధనల ప్రకారం చేసుకుంటూ వెళ్లాలనేది పురంధేశ్వరి వర్షన్. సీఐడీ కూడా ఈ కేసులో చంద్రబాబును నిందితుడేనని తేల్చి చెప్పింది. అటు నారా లోకేశ్‌ పాత్రపైనా విచారణ జరుగుతోందంటూ బాంబు పేల్చింది సీఐడీ.

మొత్తానికి, నిజంగా స్కామ్‌ జరిగిందా లేదా అనే కంటే.. ఇది పొలిటికల్‌గా ఏ మలుపు తిరుగుతుందన్న దానిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది.

వీకెండ్ హౌర్ విత్ మురళీకృష్ణ వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..