Revanth Reddy: ప్రజల సమస్యలతో పోలిస్తే మావి ప్రాబ్లమ్స్ కావు : రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ మార్క్ రాజకీయం మొదలైందా? కమిటీల్లో పేర్లపై తిరుగుబాటు చేసిన సీనియర్లకు తనదైన స్టయిల్‌లో చెక్‌పెట్టారా? తన టీమ్ మెంబర్స్‌తో రాజీనామాలు చేయించడం అందులో భాగమేనా? జీ-9 నేతలకు ముందు ముందు రేవంత్ ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నారు?
వలస నేతలకు ప్రాధాన్యంపై అభ్యంతరం.. సేవ్ కాంగ్రెస్ నినాదంతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై తిరుగుబావుటా ఎగురవేశారు సీనియర్లు. నిన్న మొన్న వచ్చినోళ్లకు పెద్దపీట వేసి మొదటినుంచి పార్టీని అట్టిపెట్టుకుని ఉన్నవాళ్లకు మొండిచేయి చూపిస్తారా అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మ్యాటర్ ఇంతటితో వదిలేదే లే.. అధిష్టానం దగ్గర పంచాయితీ పెట్టి తేల్చేసుకుంటామన్నారు. ఈ క్రమంలో రేవంత్ ప్రెస్ మీట్ సంచలనంగా మారింది. తన పాదయాత్ర కార్యచరణను పోలీసులమని చెప్పుకున్న రౌడీ మూక దొంగిలించిదని రేవంత్ ఆరోపించారు. సీనియర్లను ఎవరైనా తిడితే చెప్పుతో కొట్టండి.. కానీ తనపై ఆరోపణలు చేయవద్దన్నారు. తీన్మార్ మల్లన్న ఎవరినో తిడితే తనకేం సంబంధమన్నారు. తనపై ఉన్న అపోహలు తీసివేసి.. నమ్మకంతో పనిచేయాలన్నారు. సమస్యల్ని పరిష్కరించడానికి హైకమాండ్ ఉందన్నారు.
Published on: Dec 18, 2022 08:22 PM
వైరల్ వీడియోలు
Latest Videos