Pawan Kalyan Live: నా వ్యూహం అంతా ఏపీ భవిష్యత్ కోసమే : పవన్
గుంటూరు జిల్లా నివురు గప్పిన నిప్పులా మారింది. ఇప్పుడు జనసేనాని పర్యటన ఏపీ పాలిట్స్ లో సెగలు పుట్టిస్తోంది. సత్తెనపల్లిలో జరగనున్న కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గుంటూరు జిల్లా నివురు గప్పిన నిప్పులా మారింది. మాచర్ల, తెనాలి ఘటనలకు తోడు.. ఇప్పుడు జనసేనాని పర్యటన ఏపీ పాలిట్స్ లో సెగలు పుట్టిస్తోంది. సత్తెనపల్లిలో జరగనున్న కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గమైన సత్తెనపల్లి. ఇటీవల పవన్‌ను టార్గెట్ చేసుకుని అంబటి రాంబాబు ఎన్నో విమర్శలు, ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ఎలాంటి ప్రసంగం చేయనున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే పవన్‌ను అసలు రాజకీయ నాయకుడిగానే చూడటం లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఆయన వేరే ఎవరి కోసమో పనిచేసే వీకెండ్ లీడర్ అంటూ ఆరోపించారు. పవన్‌ను చూసి భయపడాల్సిన అవసరం తమ పార్టీకి లేదంటున్నారు.
Published on: Dec 18, 2022 12:54 PM
వైరల్ వీడియోలు
Latest Videos