Telangana Elections: ఎమ్మెల్యే రేగా కాంతారావుకు వ్యతిరేకంగా మహిళల నినాదాలు.. బూటు తీసి..

|

Nov 30, 2023 | 5:44 PM

తెలంగాణలో పోలింగ్ ముగిసింది. చెదురుముదురు సంఘటనలు మినహా.. చివరివరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ వచ్చింది. కొన్నిచోట్ల క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. ఎన్నికల వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని ఏడూళ్ళ బయ్యారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

తెలంగాణలో పోలింగ్ ముగిసింది. చెదురుముదురు సంఘటనలు మినహా.. చివరివరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ వచ్చింది. కొన్నిచోట్ల క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. ఎన్నికల వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని ఏడూళ్ళ బయ్యారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ పరిశీలించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావును మహిళలు అడ్డుకున్నారు. రేగాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మహిళలు ముందుకు దూసుకొచ్చారు. దీంతో బూటు చూపిస్తూ రేగా కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంతారావును స్థానికులు చుట్టుముట్టారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల తీవ్ర మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..