CM KCR: బూర్గంపాడు సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే బీఆర్‌ఎస్ గెలవాలన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బాసులు. కాంగ్రెస్, బీజేపీలకు మాత్రం బాసులు ఢిల్లీలో ఉంటారన్నారు. అన్నీ ఆలోచించి ప్రజలు ఓటేయాలని, అభ్యర్థుల గుణగణాలు,పార్టీల నేపథ్యం చూసి నిర్ణయం తీసుకోవాలన్నారు. దేశంలోనే 24 గంటలు కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు కేసీఆర్. గుజరాత్‌లో కూడా కరెంట్ 24 గంటలు లేదన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగసభలకు హాజరయ్యే వారిని ప్రశ్నలడుగుతూ సమ్మతి తెలిపేందుకు చేతులెత్తాలని చెబుతుంటారు సీఎం కేసీఆర్. ముఖ్యంగా ధరణి, రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్ కావాలా వద్దా అని నేరుగా ఓటర్లనే అడుగుతూ వారిని చేతులు లేపి సమ్మతి తెలపమంటారాయన. సీఎం కేసీఆర్ పాల్గొన్న ప్రతి ఎన్నికల ప్రచారసభలోనూ ఈ దృశ్యం కనపడుతుంటుంది. తాజగా బూర్గంపాడు బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.
మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..
Published on: Nov 13, 2023 02:38 PM
వైరల్ వీడియోలు
Latest Videos