Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో ఓటరు దేవుళ్లు ఎవరి వైపు? ప్రజా నాడి తెలుసుకునేందుకు టీవీ9 'జనతా దర్బార్'

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో ఓటరు దేవుళ్లు ఎవరి వైపు? ప్రజా నాడి తెలుసుకునేందుకు టీవీ9 ‘జనతా దర్బార్’

Janardhan Veluru

|

Updated on: Nov 13, 2023 | 3:48 PM

Telangana Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచాయి. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు దేవుళ్ల తీర్పు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారుతోంది. విజయంపై ఇటు అధికార బీఆర్ఎస్, అటు విపక్ష కాంగ్రెస్, బీజేపీలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచాయి. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు దేవుళ్ల తీర్పు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారుతోంది. విజయంపై ఇటు అధికార బీఆర్ఎస్, అటు విపక్ష కాంగ్రెస్, బీజేపీలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ9 బృందం. ‘జనతా దర్బార్‌‘ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని కేబీఆర్ పార్క్ వద్ద మా టీమ్ ప్రజల అభిప్రాయం తెలుసుకుంది. ఎన్నికల్లో ధన ప్రభావం పెరిగిపోతోందంటూ పలువురు ఆందోళన వ్యక్తంచేశారు.  మరి ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు? అధికార బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతుందా? ప్రజలు మార్పునకు మొగ్గుచుపుతున్నారా? తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి

Published on: Nov 13, 2023 02:51 PM