Watch Video: కర్ణాటక మోడల్ ఫెయిల్యూర్.. కాంగ్రెస్‌పై మంత్రి హరీష్ రావు విమర్శనాస్త్రాలు

Watch Video: కర్ణాటక మోడల్ ఫెయిల్యూర్.. కాంగ్రెస్‌పై మంత్రి హరీష్ రావు విమర్శనాస్త్రాలు

Janardhan Veluru

|

Updated on: Nov 13, 2023 | 4:48 PM

కర్ణాటక మోడల్‌ ఫెయిల్యూర్ మోడల్‌ అంటూ ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. కర్ణాటక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత ఐదు నెలల్లోనే ఆ రాష్ట్రంలో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.

కర్ణాటక మోడల్‌ ఫెయిల్యూర్ మోడల్‌ అంటూ ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. కర్ణాటక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత ఐదు నెలల్లోనే ఆ రాష్ట్రంలో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక రైతు బంధు కూడా బంద్‌ అయిందన్నారు. 24 గంటల కరెంట్‌ ఇచ్చే తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఆ రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం.. కర్నాటకలో 5 గంటల కరెంట్‌ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అలాంటి కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారని ప్రశ్నించారు హరీష్ రావు. తెలంగాణలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై స్పందిస్తూ హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

YSRTP నేతలు గట్టు రామచంద్రరావుతో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. మంత్రి హరీష్ రావు గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించిన వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు.