Watch Video: రసవత్తర పోరు.. అక్కడ మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కటే సామాజిక వర్గం..
Telangana Elections 2023: ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు కీలకం. పార్టీలు కూడా ఈ విషయంలో ఆచితూచి అడుగేస్తుంటాయి. ఒక పార్టీ ఓ కులానికి టికెట్ ఇస్తే ప్రత్యర్థి పార్టీ మరో బలమైన వర్గంనుంచి అభ్యర్థిని దించుతుంది. కానీ అదేం చిత్రమో అక్కడ మాత్రం మూడు పార్టీలు కూడబలుక్కున్నట్లు.. ఒకే వర్గానికి సీట్లిచ్చాయి. పట్టున్న మున్నూరు కాపు సామాజికవర్గంవైపే పార్టీలన్నీ మొగ్గుచూపాయి.
ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు కీలకం. పార్టీలు కూడా ఈ విషయంలో ఆచితూచి అడుగేస్తుంటాయి. ఒక పార్టీ ఓ కులానికి టికెట్ ఇస్తే ప్రత్యర్థి పార్టీ మరో బలమైన వర్గంనుంచి అభ్యర్థిని దించుతుంది. కానీ అదేం చిత్రమో అక్కడ మాత్రం మూడు పార్టీలు కూడబలుక్కున్నట్లు.. ఒకే వర్గానికి సీట్లిచ్చాయి. పట్టున్న మున్నూరు కాపు సామాజికవర్గంవైపే పార్టీలన్నీ మొగ్గుచూపాయి. అదే కరీంనగర్ నియోజకవర్గం. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున గంగుల కమలాకర్, బీజేపీ నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి పురమల్ల శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. గంగుల కమలాకర్ ఇప్పటి వరకు ఇక్కడి నుంచి మూడుసార్లు గెలిచి.. ఇప్పుడు నాలుగోసారి పోటీ చేస్తున్నారు. బండి సంజయ్ గతంలో రెండుసార్లు ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోగా.. పురమల్ల శ్రీనివాస్ తొలిసారిగా అక్కడి నుంచి బరిలో దిగుతున్నారు.
కరీంనగర్ నియోజకవర్గంలో 3.40 లక్షల మంది ఓటర్లు ఉండగా.. మున్నూరు కాపు, ముస్లీం ఓటర్ల కీలకం. ఈ నియోజకవర్గంలో ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లే లక్షకు పైగా ఉన్నట్లు అంచనావేస్తున్నారు. గతంలో వెలమల సామాజిక వర్గం వారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచేవారు.. ఇప్పుడు మున్నూరు కాపుల హవా కొనసాగుతోంది. మరి నియోజకవర్గ ప్రజలు ముగ్గురు మున్నూరు కాపు నేతల్లో ఎవరికి పట్టంకడుతారో ఆసక్తికరంగా మారింది. మరి ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారు? ఆయా అభ్యర్థుల బలాబలాలు ఏంటో ఈ వీడియోలో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి