Watch Video: మంత్రి తలసానిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయన లాంటి నాయకులు 50 మంది ఉంటే..

Watch Video: మంత్రి తలసానిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయన లాంటి నాయకులు 50 మంది ఉంటే..

Janardhan Veluru

|

Updated on: Nov 13, 2023 | 1:27 PM

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ లాంటి నాయకులు ఒక 50 మంది ఉంటే ఏ పార్టీకి ఎన్నికలంటే టెన్షన్‌ ఉండదని అన్నారు. ఒక ప్రణాళిక, ఒక వ్యూహంతో అందరిని కలుపుకొని పోయి పనిచేసే నాయకుడు శ్రీనివాస్‌ యాదవ్‌ అని కొనియాడారు. సనత్‌ నగర్‌లో BRS బూత్‌ లెవల్‌ కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ లాంటి నాయకులు ఒక 50 మంది ఉంటే ఏ పార్టీకి ఎన్నికలంటే టెన్షన్‌ ఉండదని అన్నారు. ఒక ప్రణాళిక, ఒక వ్యూహంతో అందరిని కలుపుకొని పోయి పనిచేసే నాయకుడు శ్రీనివాస్‌ యాదవ్‌ అని కొనియాడారు. సనత్‌ నగర్‌లో BRS బూత్‌ లెవల్‌ కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రచార పోకడలను కేటీఆర్‌కు వివరించారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ పదేళ్ల కాలంలో జరిగిందనే విషయాన్ని సనత్‌ నగర్‌ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ప్రతీ రోజు బూత్‌ స్థాయి కార్యకర్తలు 400 ఇళ్లు సందర్శిస్తున్నారని వెల్లడించారు. తలసాని కుమారుడు తలసాని సాయి ఎన్నికల ప్రచారంలో టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న తీరును కేటీఆర్‌ అభినందించారు.