Congress Public Meeting at Palakurthy: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరుస పర్యటనలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సభలు, సమావేశాలతో క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఇవాళ పాలకుర్తిలో పర్యటిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మామిడాల యశశ్వినిరెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా నిర్వహించే సభకు రేవంత్ హాజరై ప్రసంగిస్తున్నారు. ఈ సభలో పలువురు కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు.
రేవంత్ రెడ్డి పాలకుర్తి సభను వీక్షించండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..