తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రజాకర్షక పథకాలతో ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా చేవెళ్ల డిక్లరేషన్‌ను ప్రకటించబోతోంది. చేవెళ్లలో నిర్వహిస్తున్న ప్రజాగర్జన బహిరంగ సభలో నేడు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను విడుదల చేయబోతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తెలంగాణలో అనుకూల వాతావరణం ఉన్న ధీమాలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ఇప్పటికే యూత్ డిక్లరేషన్, వ్యవసాయ డిక్లరేషన్లను కాంగ్రెస్ ప్రకటించింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి దూసుకెళ్లే యత్నం చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెబుతూనే వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనుకుంటోంది. అన్ని సామాజిక వర్గాల వారీగా ప్రయోజనం చేకూర్చే పథకాలతో డిక్లరేషన్లను తయారు చేస్తోంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ నేతల అభిప్రాయాలను తీసుకుని డిక్లరేషన్‌ను తయారు చేశారు.
కాసేపట్లో చేవెళ్లలో మొదలు కానున్న బహిరంగసభలో పాల్గొనే మల్లికార్జున ఖర్గే, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏయే వర్గాలను లాభం చేకూరనుందో చెప్పనున్నారు. ఎస్సీ-ఎస్టీ డిక్లరేషన్ల ద్వారా.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చెయ్యాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు అసైన్ చేసిన భూముల్లో యాజమాన్యం హక్కులపై మల్లికార్జున ఖర్గే ప్రకటన చేయనున్నారు. ఆ భూములను అమ్ముకోవడం సహా అన్ని రకాల యాజమాన్యం హక్కులను అనుభవించవచ్చని హామీ ఇవ్వనున్నారు. పోడు భూముల అంశంపై డిక్లరేషన్‌లో స్పష్టత రానుంది. దళిత బంధు తరహాలో గిరిజన బందుపై స్పష్టత ఇవ్వనుంది కాంగ్రెస్ పార్టీ. గిరిజనులకు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయంపై కూడా ఇదే వేదికగా ప్రకటన చేయనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...