Priyanka Gandhi: తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం చేశారు.. ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు..

Priyanka Gandhi - Congress Public Meeting: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. వ్యూహాలు ప్రతివ్యూహాలతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా గెలవాలన్న ఆకాంక్షతో కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లాంటి అగ్రనేతలు రోడ్ షోల్లో పాల్గొని ప్రచారం నిర్వహించారు.

Follow us

|

Updated on: Nov 20, 2023 | 6:49 AM

Priyanka Gandhi – Congress Public Meeting: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. వ్యూహాలు ప్రతివ్యూహాలతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా గెలవాలన్న ఆకాంక్షతో కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లాంటి అగ్రనేతలు రోడ్ షోల్లో పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇవాళ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలంగాణకు వచ్చారు. ఖానాపూర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ పలు కీలక విషయాలపై మాట్లాడారు. తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం చేశారని , కాని వాళ్ల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు ప్రియాంక. గత 10 ఏళ్ల నుంచి ఉద్యోగాలు లేక యువత తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు. సోనియాగాంధీ తెలంగాణ బిడ్డల ఆంకాంక్షల కోసం రాష్ట్రాన్ని ప్రకటించారని తెలిపారు. ఖానాపూర్ సభలో ప్రసంగించిన ప్రియాంక గాంధీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు క్రికెట్ ప్రపంచ కప్ ఉందని.. భారత్ ప్రపంచ కప్ గెలవాలని అందరూ కోరుకుందామని తెలిపారు. టీమిండియాకు బెస్ట్‌ విషెస్‌ చెప్పిన ప్రియాంక.. భారత్‌ తప్పకుండా వరల్డ్‌కప్‌ గెలుస్తుందంటూ పేర్కొన్నారు.

ఖానాపూర్ అనంతరం అసిఫాబాద్ కు చేరుకోనున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం ప్రియాంక గాంధీ నాగోబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా గిరిజనులను కలిసి మాట్లాడనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓటర్‌ స్లిప్‌ రాలేదా.? మీ పోలింగ్ బూత్‌ ఎక్కడో ఇలా తెలుసుకోండి..
ఓటర్‌ స్లిప్‌ రాలేదా.? మీ పోలింగ్ బూత్‌ ఎక్కడో ఇలా తెలుసుకోండి..
ఎగ్జిట్ పోల్ అంటే ఏంటి ? దాని ఖచ్చితత్వం ఎంత..?
ఎగ్జిట్ పోల్ అంటే ఏంటి ? దాని ఖచ్చితత్వం ఎంత..?
ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన రూల్స్ రంజన్.. ఎక్కడ ..? ఎప్పుడంటే
ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన రూల్స్ రంజన్.. ఎక్కడ ..? ఎప్పుడంటే
పెర్ఫార్మెన్స్ కి ఫుల్‌ మార్క్స్! పుష్ప నుండి వీరసింహారెడ్డి వరకు
పెర్ఫార్మెన్స్ కి ఫుల్‌ మార్క్స్! పుష్ప నుండి వీరసింహారెడ్డి వరకు
ప్రియురాలితో పెళ్లి.. తీన్మార్ స్టెప్పులేసిన టీమిండియా క్రికెటర్
ప్రియురాలితో పెళ్లి.. తీన్మార్ స్టెప్పులేసిన టీమిండియా క్రికెటర్
బిగ్ బాస్ ఫన్నీ టాస్క్..ప్రియాంక చేసిన పనికి హర్ట్ అయిన అమర్ దీప్
బిగ్ బాస్ ఫన్నీ టాస్క్..ప్రియాంక చేసిన పనికి హర్ట్ అయిన అమర్ దీప్
సినిమా సెలబ్రిటీస్ ఏయే పోలింగ్ బూతుల్లో ఓటెయ్యనున్నారంటే
సినిమా సెలబ్రిటీస్ ఏయే పోలింగ్ బూతుల్లో ఓటెయ్యనున్నారంటే
పొన్నూరులో రంజుగా మారిన రాజకీయం.. !
పొన్నూరులో రంజుగా మారిన రాజకీయం.. !
సల్మాన్‌కు మళ్లీ బెదిరింపులు.. చావుకు వీసా అవసరం లేదంటూ వార్నింగ్
సల్మాన్‌కు మళ్లీ బెదిరింపులు.. చావుకు వీసా అవసరం లేదంటూ వార్నింగ్
ఇద్దరు రాజుల మధ్య సినిమా యుద్ధం.. చూడడానికి ప్రేక్షకులంతా సిద్ధం.
ఇద్దరు రాజుల మధ్య సినిమా యుద్ధం.. చూడడానికి ప్రేక్షకులంతా సిద్ధం.