AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

No Entry For CBI In Telangana: తెలంగాణలో CBI కి నో ఎంట్రీ.. దర్యాప్తు కోసం ఇచ్చిన అనుమతి ఉపసంహరణ..(లైవ్)

No Entry For CBI In Telangana: తెలంగాణలో CBI కి నో ఎంట్రీ.. దర్యాప్తు కోసం ఇచ్చిన అనుమతి ఉపసంహరణ..(లైవ్)

Anil kumar poka
|

Updated on: Oct 30, 2022 | 11:23 AM

Share

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన అనుమతిని వెనక్కు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 30న ఇచ్చిన జీవో 51ను రాష్ట్ర ప్రభుత్వం ఉసంహరించుకుంది.


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన అనుమతిని వెనక్కు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 30న ఇచ్చిన జీవో 51ను రాష్ట్ర ప్రభుత్వం ఉసంహరించుకుంది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా గతంలో సీబీఐకి అనుమతి ఇవ్వగా.. తాజాగా ఆ ఆదేశాలను రద్దు చేసింది. అయితే సీఎం కేసీఆర్ ఈ విషయంలో గతంలోనే పలు ఆలోచనలు చేశారు. సలహాలు, సూచనలు తీసుకున్నారు. తెలంగాణలోనూ సీబీఐ విరుచుకుపడే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతున్న సమయంలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేయాలన్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ అవినీతి నిరోధక చట్టం – 1988, ఐపీసీలోని పలు సెక్షన్లతో ఢిల్లీలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలోనూ సీబీఐ నేరుగా వెళ్లి దర్యాప్తు చేసేందుకు వీలు లేదు. ఇందు కోసం రాష్ట్రాలు జనరల్ కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో సాధారణ సమ్మతి ఇచ్చి, తర్వాత కాలంలో వాటికి రద్దు చేసిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. 2018లో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ సీబీఐకు ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది. దాంతో రాష్ట్రంలో సీబీఐ కేసులు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 30, 2022 11:23 AM
Follow Us