Telangana: ‘రేవంత్‌రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారు..’ కోమటిరెడ్డి కీలక కామెంట్స్
మతాలు, కులాల మధ్య భాజపా చిచ్చు పెడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ శిందేలు ఎవరూ లేరని.. ఆయన్ను సృష్టించిందే బీజేపీ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డికి హితవు పలికారు.
BRS, BJP పార్టీలపై మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..కాంగ్రెస్‌లో ఏకనాథ్ షిండేలు లేరని..ఏకనాథ్ షిండేను సృష్టించిందే బీజేపీ పార్టీ అని ఫైర్ అయ్యారు..హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరించారు. పనికిరాని చిట్‌చాట్‌లు బంద్ చేయాలన్నారు..మా పార్టీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి మాట్లాడొద్దు, బండి సంజయ్ ఎందుకు మార్చారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా అని నిలదీశారు..కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది, సీఎంగా రేవంత్ రెడ్డే ఉంటారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Apr 11, 2024 02:03 PM
వైరల్ వీడియోలు
Latest Videos