Telangana: షబ్బీర్ అలీ ఇంట్లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విందు ఆరగించారు. ఈ మేరకు ఒక ప్రకటనలో ముస్లింలకు సీఎం రేవంత్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్. నేడు దేశవ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లిం సోదరలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ సీనియర్ షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లారు రేవంత్. ఆయనతో పాటు సికింద్రాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ కు షబ్బీర్ అలీ, ఆయన కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. షబ్బీర్ అలీకి, ఆయన కుటుంబ సభ్యులకు అక్కడున్న ఇతర ముస్లిం పెద్దలకు రేవంత్ రంజాన్ విషెస్ తెలిపారు. అందరితో కలిసి ముఖ్యమంత్రి అల్పాహారం తిన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
Latest Videos