Headlines: చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వస్తుందా.? | తెలంగాణలో నేటితో నామినేషన్లు క్లోజ్.

|

Nov 10, 2023 | 9:29 AM

తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ మరికొద్ది గంటల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియబోతోంది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2317 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజే 1129 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న మంచి ముహూర్తం ఉండటంతో సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్‌ వేశారు. మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల నుంచి, హరీశ్‌ రావు సిద్దిపేట నుంచి నామినేషన్లు వేశారు. నామినేషన్లకు సరిగ్గా ఒక రోజు ముందు కాంగ్రెస్‌ పార్టీ చివరి జాబితాను విడుదల చేసింది.

తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ మరికొద్ది గంటల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియబోతోంది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2317 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజే 1129 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న మంచి ముహూర్తం ఉండటంతో సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్‌ వేశారు. మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల నుంచి, హరీశ్‌ రావు సిద్దిపేట నుంచి నామినేషన్లు వేశారు. నామినేషన్లకు సరిగ్గా ఒక రోజు ముందు కాంగ్రెస్‌ పార్టీ చివరి జాబితాను విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ తుది జాబితాలోని అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దీనికి తోడు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డిలో నామినేషన్‌ వేయనున్నారు. కామారెడ్డిలో నేడు బహిరంగ సభ కూడా ఉంది. బీసీ డిక్లరేషన్‌ ప్రకటించనున్న ఈ సభకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య హాజరుకానున్నారు. ఇక నామినేషన్లకు సరిగ్గా ఒకరోజు ముందు బీజేపీ కూడా ఓ జాబితాను విడుదల చేసింది. మల్కాజ్‌గిరి నుంచి రామచంద్రరావుకు, పెద్దపల్లి నుంచి ప్రదీప్‌రావుకు టికెట్లు దక్కాయి. ఉత్కంఠ రేపిన శేరిలింగంపల్లి నుంచి రవికుమార్ యాదవ్‌కు టికెట్‌ దక్కింది. నాంపల్లి నుంచి రాహుల్ చంద్ర, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి కృష్ణప్రసాద్, నకిరేకల్‌ నుంచి మొగిలయ్యకు టికెట్లు దక్కాయి. వీరంతా నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దీనికి తోడు వేములవాడ బీజేపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ అభ్యర్థిగా తుల ఉమను ఇప్పటికే బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అయితే బీజేపీ యువ నాయకుడు వికాస్‌రావు నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. వేములవాడ టికెట్‌ వికాస్‌రావుకే ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు నిరసనలు కూడా చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Nov 10, 2023 09:00 AM