Telangana: “జలగంకు వచ్చిన అవకాశం మీ మధిర బిడ్డకు రాబోతోంది”
ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని.. అందుకోసం కార్యకర్తలు కంకణబద్ధులై పనిచేయాలని భట్టి పిలుపునిచ్చారు. నెలరోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందన్నారు. నాలుగోసారి ఆశీర్వదించి.. గెలిపించాలని భట్టి ప్రజలను కోరారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మధిర దశాదిశా నిర్దేశించేందిగా ఉండాలన్నారు.
గురువారం ఖమ్మం జిల్లా మధిరలో భట్టి విక్రమార్క నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక కామెంట్స్ చేశారు. ఖమ్మం జిల్లాలో జలగం వెంగళరావుకు ముఖ్యమంత్రిగా వచ్చిన అవకాశం… ఇప్పుడు మీ మధిర బిడ్డగా తనకు రాబోతోందన్నారు. నాలుగోసారి తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. BRS ప్రభుత్వాన్ని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. నెలరోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని భట్టి చెప్పారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మధిర దశాదిశా నిర్దేశించేందిగా ఉండాలన్నారు. ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని.. . కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానన్నరు భట్టి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
అలల్లా ఎగసిపడిన మంచు..షాకింగ్ వీడియో
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్తో వంటనూనె తయారీ!

