Telangana: హ్యాండిచ్చిన కాంగ్రెస్‌.. అభిమానులకు అద్దంకి దయాకర్ కీలక మెసేజ్

Telangana: హ్యాండిచ్చిన కాంగ్రెస్‌.. అభిమానులకు అద్దంకి దయాకర్ కీలక మెసేజ్

Ram Naramaneni

|

Updated on: Nov 10, 2023 | 8:57 AM

కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తానన్నారు అద్దంకి దయాకర్. మందుల శామ్యూల్‌ గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు. తన మద్దతుదారులు, కార్యకర్తలు అధైర్యపడవద్దని.. ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడవద్దని ఆయన సూచించారు. కొన్ని ఈక్వేషన్స్ కారణంగా సీటు దక్కకపోయి ఉండవచ్చని దయాకర్ అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంపై అద్దంకి దయాకర్ కీలక ప్రకటన చేశారు. తుంగతుర్తి టికెట్ విషయంలో అదిష్టానం నిర్ణయం శిరసా వహిస్తానని అన్నారు. అనేక ఈక్వెషన్‌ల తర్వాత టికెట్ వేరొకరికి ఇచ్చారని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. టికెట్ దక్కించుకున్న సామ్యూల్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని… పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని వెల్లడించారు. పార్టీకి వ్యతిరేకంగా, నాయకులకు వ్యతిరేకంగా ఎటువంటి కామెంట్స్ చేయొద్దని ఆయన క్యాడర్‌కు పిలుపునిచ్చారు. అద్దంకి దయాకర్‌కు టికెట్‌ దక్కుతుందని ఆయన మద్దతుదారులు ఊహించినా అలా జరగలేదు. తాను బాధపడటం లేదంటూ వీడియో సందేశం పంపారు అద్దంకి దయాకర్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

 

Published on: Nov 10, 2023 08:30 AM